నేటి కాలంలో చాలామంది మాంసాహారం వంటలో పుదీనా వేయకుండా అసలు ఉండలేరు. అయితే పుదీనా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఔషధ గుణాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుదీనా చాలా చవకగా దొరుకుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, నోటి సమస్యలు, ఇన్ఫెక్షన్లు, గొంతు మంట, శ్వాస సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. గొంతు లేదా నోరు మంటను తగ్గించడానికి పుదీనా ముఖ్య ఔషధంగా పనిచేస్తుంది.


పుదీనా క్యాన్సర్ సమస్యలను నయం చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లను తొలగించడానికి పుదీనా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో చాలావరకు అనేక రకాల మందులలో పుదీనాను చాలా రకాలుగా వాడేవారు. పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం రెండు మూడు ఆకులను అయినా తినాలని పేర్కొంటున్నారు. పుదీనాను తినడం వల్ల చర్మవ్యాధులు చాలావరకు దూరమవుతాయి. పుదీనా ఆకులను జ్యూస్ చేసుకొని తాగినట్లయితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.


శరీరంలో ఏర్పడే అనేక రకాల ఇన్ఫెక్షన్లను పుదీనా రసం తొలగిస్తుంది. అయితే పుదీనా రసంలో పంచదార, కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకున్నట్లయితే అలసట, నీరసం సమస్యలు తొలగిపోతాయి. పుదీనాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా దీనిని జ్యూస్ చేసుకొని తాగినట్లయితే కడుపు నిండుగా ఉండి ఆకలి లేదు తద్వారా సులభంగా బరువు తగ్గుతారు. చాలామంది పంటి సమస్యలతో బాధపడతారు. అలాంటివారు పుదీనా ఆకులను తప్పకుండా నమిలి తిన్నట్లయితే పంటి నొప్పులు తగ్గుముఖం పడతాయి.


నోటి దుర్వాసన వచ్చిన సమయంలో పుదీనాను రెండు ఆకులు నమిలి తిన్నట్లయితే దుర్వాసన తొలగిపోతుంది. వారంలో రెండు మూడుసార్లు అయినా పుదీనా జ్యూస్ చేసుకుని తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. చాలామంది పుదీనాను పచ్చడి కూడా చేసుకొని తింటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసాహారం వంట చేసిన సమయంలో చాలామంది పుదీనాను వాడుతారు. దీనివల్ల సువాసనతో పాటు రుచి కూడా బాగుంటుంది. పుదీనాను ఇలాంటి ఆహారంలోనైనా సరే వేసుకొని తప్పకుండా తినాలి దానివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: