ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టెస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితాలను విడుదల చేశారు. అందులో మొదటి స్థానంలో బాస్మతి బియ్యం నిలిచింది. రెండవ స్థానంలో ఇటలీకి చెందిన అర్బోరియో, మూడవ స్థానంలో పోర్చుగల్ కు చెందిన కరోలినా రైస్ నిలిచాయి. భారతీయ బాస్మతి బియ్యంలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా బాస్మతిలో రుచి, సువాసన చక్కగా ఉంటాయి. పెద్ద ధాన్యాల కారణంగా బాస్మతికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.


ముఖ్యంగా భారతీయులు చాలా వరకు బాస్మతితో పులావ్, బిర్యానీ చేసుకొని తింటారు. ప్రపంచం మొత్తానికి బాస్మతి బియ్యాన్ని భారతదేశం సరఫరా చేస్తుంది. ఈ బాస్మతి బియ్యాన్ని పాకిస్తాన్ లో సాగు చేయబడినప్పటికీ ఎగుమతి పరంగా భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. బాస్మతి సాంస్కృత పదాలు వాస్, మయాప్ తో రూపొందించారు. వాస్ అంటే సువాసన, మయాప్ అంటే లోతు, మతి అంటే రాణి అని అర్థాలు. అందుకే బాస్మతి బియ్యాన్ని సువాసనల రాణి అని పిలుస్తారు.



భారతదేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరఖండ్ లో ఈ బియ్యాన్ని సాగు చేస్తున్నారు. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకం ప్రకారం హరప్పా-మొహంజోదారో త్రవ్వకాలలో దీనికి సంబంధించిన అనేక ఆధారాలు లభించాయి. భారతీయ బాస్మతి చాలా రుచిగా ఉంటుంది. తద్వారా దీనిని తినడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తారు. కొద్దిగా తినడంతోనే కడుపు నిండుతుంది.


ముఖ్యంగా బాస్మతి బియ్యం తినడం వల్ల బరువు సులభంగా తిరగవచ్చు. బాస్మతిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దానివల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. డైట్ ఫాలో అయ్యేవారు కూడా రోజుకు రెండు పూటలు బాస్మతి రైస్ ను కడుపునిండా తినొచ్చు. దానివల్ల ఎలాంటి అనారోగ్యం సంభవించదు. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్య నిపుణులు వెల్లడించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: