వయసు పెరిగే కొద్ది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఫిట్‌గా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదు. 50 దాటిన తర్వాత శరీరం చాలా మార్పులు చెందుతుంది. ఈ మార్పులు పురుషులకే కాదు, మహిళలకూ జరుగుతాయి. 50 దాటిన తర్వాత ఎముకలు, కండరాలకు నష్టం జరగకుండా కొన్ని వ్యాయామాలు ఆపేయాలి. ఇప్పుడు ఆ వ్యాయామాలేంటో చూద్దాం. కీళ్లపై ఒత్తిడి తెచ్చే వ్యాయామాలు చేయవద్దు. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు పెరుగుతాయి. 50 దాటిన తర్వాత ఎక్కువ దూరం పరుగులు తీయడం మానేయవద్దు. ఇది కీళ్లపై ఒత్తిడి తెస్తుంది, కండరాలను బలహీనం చేస్తుంది.

బరువులు ఎత్తడం మానేయండి. చిన్న తప్పులు కూడా పెద్ద గాయాలకు కారణమవుతాయి. 50 దాటిన తర్వాత శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎముకలు, కండరాల గాయాలు నెమ్మదిగా మానేస్తాయి. మీకు ఇష్టమైన వ్యాయామాలు చేయాలంటే, గాయాలు జరగకుండా జాగ్రత్తగా చేయండి. నాలుగు వర్కౌట్స్ అసలు చేయకూడదు. ఇవి వెరీ డేంజరస్.క్రంచెస్: మనం కడుపు కండరాలను బలపరచడానికి చేసే క్రంచెస్ అనే వ్యాయామం ఉంది. కానీ మెడ వెనక భాగాన్ని చాలా వంచి చేసే క్రంచెస్ మంచివి కావు. ఎందుకంటే ఇవి మెడ, భుజాలపై ఒత్తిడి తెస్తాయి. దీంతో మనకు నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

బర్పీస్: బర్పీస్ అనేది శరీరం మొత్తాన్ని వ్యాయామం చేయించే ఒక రకమైన వ్యాయామం. ఇది చాలా కేలరీలను బర్న్ చేస్తుంది. కానీ ఇది కీళ్లకు చాలా హాని చేస్తుంది. కాబట్టి 50 దాటిన తర్వాత బర్పీస్ చేయడం మంచిది కాదు.లెగ్ ఎక్స్‌టెన్షన్ వ్యాయామాలు: జిమ్‌లలో చాలా మంది తమ కాళ్ల కండరాలను బలపరచడానికి మెషీన్ల సహాయంతో వ్యాయామాలు చేస్తారు. కానీ ఈ వ్యాయామాలు చేయడం వల్ల మన మోకాళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. దీంతో మోకాళ్లకు గాయాలు అయ్యే అవకాశం ఉంది.

స్క్వాట్స్: స్క్వాట్స్ అనేవి మన కాళ్ల కండరాలను బలపరచడానికి చేసే వ్యాయామాలు. కానీ 50 దాటిన తర్వాత స్క్వాట్స్ చేయడం మంచిది కాదు. అలాగే జంప్ చేసే వ్యాయామాలు కూడా చేయకూడదు. బదులుగా నెమ్మదిగా, నియంత్రిత కదలికలతో చేసే వ్యాయామాలు చేయాలి. స్ప్రింట్ చేయడం, జంప్ చేయడం వంటివి మానేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: