చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉబకాయం అనేది దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయింది. ఇది అధిక కొవ్వు శరీరంలో ఉండడం వల్ల ఇలా ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందట. BMI -30 కంటే ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదమట. అయితే స్థూలకాయం అనేది చాలా కారణాలవల్ల ఇది సంభవిస్తుందట. ప్రధానంగా జన్యువులు అతిగా తినడం లేదా స్థూల పదార్థాలను ఎక్కువగా తినడం ,పనిచేయకుండా ఉండటం వల్ల అధిక బరువు ఏర్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మరికొన్ని థైరాయిడ్ మందుల వల్ల కూడా ఉభకాయానికి దారితీస్తుందట.



అయితే ఈ సమస్యలు పురుషులకంటే మహిళలకు చాలా ప్రమాదాన్ని తీసుకువస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో  వాటిని వదిలించుకోవాలి అంటే పలు రకాల ఆహార ప్రణాళికలను సైతం అమలు చేసుకోవలసి ఉంటుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియంత్రించడమే చాలా ముఖ్యమని చెప్పవచ్చు. స్థూలకాయ నుంచి బయటపడేందుకు స్త్రీలు పురుషులు సైతం పలు రకాల ఆహార పదార్థాలు చాలా అవసరం అన్నట్టుగా ఇటీవలే ఒక అధ్యయనంలో తెలియజేశారు. NCBI నివేదిక ప్రకారం ఉబకాయం కలిగి ఉన్న మహిళలు ఎక్కువగా మధుమేహం, రొమ్ము క్యాన్సర్ గుండె జబ్బులు వంటి సమస్యలతో మరణిస్తున్నారట. వీటివల్ల పురుషుల కంటే మహిళలే మరణించే ప్రమాదం సంఖ్య ఎక్కువగా ఉన్నదట.


అయితే ఇలా ఉపకాయం అధికంగా ఉన్నా పురుషులలో పల్మనారి డిసీస్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఇతరత్రా వ్యాధులు చుట్టుముడతాయట. పురుషులు బరువు తగ్గడానికి అధిక పిండి కలిగి ఉన్న పదార్థాలను మాత్రమే తినాలి మహిళలు అధిక కొవ్వు కలిగి ఉన్న ఆహార పదార్థాలను అల్పాహారంగా తీసుకోవడం మంచిది. ఎవరైనా ఉపవాసం ఉన్న తర్వాత వెంటనే అధిక కార్బోహైడ్రేట్లు అధిక కొవ్వు కలిగే పదార్థాలను తినడం వల్ల బరువును తగ్గించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక ఫ్యాట్ కలిగించే ఆహారాలను తినడం కూడా మంచిది కాదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: