ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. హెల్త్ బాగుంటేనే ఏ పనైనా చేయగలం. ఏదైనా సాధించగలం. జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించగలం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.  అయితే డాక్టర్లు హెల్తీ ఫుడ్ డైట్ లో భాగం చేసుకున్నా చాలు చాలా అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. స్మూతీలు ఈజీగా డైజెస్ట్ కావడమే కాకుండా బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని కూడా సూచిస్తున్నారు. వీటిలో బనానా స్మూతీ అత్యంత పోషక విలువలు ఉన్న, టేస్టియస్ట్ స్మూతీగా నిలుస్తోంది.

బరువు పెరగాలని ట్రై చేసేవారు అరటిపండు స్మూతీ కచ్చితంగా తమ డైట్ లో భాగం చేసుకోవాలి. ఎందుకంటే అరటి తింటే తక్కువ సమయంలోనే బరువు పెరగవచ్చు. ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉండటమే దానికి కారణం. వారంలో ఒక్కసారైనా ఒకటి లేదా రెండు అరటి పండ్లు స్మూతీగా తయారు చేసుకొని తాగితే తింటే బీపీ తగ్గడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. గుండెపోటు వంటి ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అరటిపండు లోని ఫైబర్ మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బనానా స్మూతీ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. అందుకే వ్యాయామలు చేసేవారు ఈ స్మూతీ తప్పకుండా తినాలి. బనానా స్మూతీ తాగే వారి మజిల్స్ కూడా దృఢంగా మారుతాయి. అంతేకాదు ఎన్నో రకాల అనారోగ్యాలు కూడా దూరం అవుతాయి. ఇంట్లోనే బనానా స్మూతీ తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు రెండు అరటి పండ్లు, ఒక కప్పు పాలు, అరకప్పు గ్రీకు యోగర్ట్, రెండు టీ స్పూన్ల తేనె, నాలుగైదు ఐస్ క్యూబ్స్. ఇందులో స్ట్రాబెరీ లాంటి ఇతర ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బ్లెండర్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే బనానా స్మూతీ తయారవుతుంది. దీనిపై డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కూడా తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: