శరీరంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కొన్ని సంకేతాల ద్వారా అవి బయటపడుతుంటాయి. మూత్రం ద్వారా కూడా చాలా జబ్బులు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించినా లేదంటే రంగు మారినా కూడా అది అనారోగ్యానికి ఒక సంకేతంలాగా భావించాలి. మూత్రం రంగులను బట్టి అది ఏ అనారోగ్యానికి సంకేతమో తెలుసుకోవచ్చు. యూరిన్ కలర్ వాటర్ లాగా క్రిస్టల్ క్లియర్ లాగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న ప్రతి వారికి కూడా యూరిన్ ఇలాగే నీరు లాగా స్వచ్ఛంగా వస్తుంది.

ఒకవేళ డీహైడ్రేషన్ బారిన పడితే మూత్రం అనేది పసుపుపచ్చ కలర్ లో వస్తుంది. ఎల్లో కలర్ యూరిన్ కనిపిస్తే అప్రమత్తం కావాలి. తగినంత నీళ్లు తాగుతూ యూరిన్ కలర్ ఎల్లో నుంచి వైట్ గా మారేలాగా చూసుకోవాలి. ఒకవేళ మూత్రం ఎర్రగా వస్తే అది మూత్ర నాళ ఇన్ఫెక్షన్ అని అర్థం చేసుకోవాలి. దీనిని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. దీన్ని అలాగే వదిలేస్తే ఆ సమస్య పెద్దదిగా తయారయ్యే అవకాశం ఉంది. యూరిన్ బాగా వైట్ కలర్ లో వస్తే అది కిడ్నీలకు సంబంధించిన వ్యాధిగా అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్ని కలిసి సమస్య ఎంత తీవ్రమైనదో తెలుసుకోవాలి.

గోధుమ, ముదురు రంగు గోధుమ రంగులో మూత్రం వచ్చి ఉంటే అది కిడ్నీ, కాలేయ సమస్యలను తెలియజేస్తుంది. మూత్రం చాలా ఎర్రగా లేదా ముదురు పసుపుపచ్చ రంగుల వచ్చి ఉంటే అది కిడ్నీలో రాళ్ళకి సంకేతం. మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ఉన్న కొందరికి బ్లూ కలర్ లో మూత్రం వస్తుంది.ఆరంజ్ కలర్లో మూత్రం కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెడికేషన్స్ వాడేటప్పుడు ఆరంజ్ కలర్ లోకి మూత్రం మారుతుంది. తగినంత నీళ్లు తాగకపోయినా ఇదే కలర్ కనిపిస్తుంది.బీట్రూట్ లేదా ఇతర పింక్ కలర్ ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా యూరిన్ పింక్ ఎరుపు రంగులో వస్తుంది దీనివల్ల పెద్దగా భయపడి పోవాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: