మన జీవితంలో నిద్ర అనేది ఒక ముఖ్యమైన భాగం. మన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్రలోకి జరుగుతున్న ప్రయాణాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. ఒకటి REM నిద్ర, మరొకటి NREM నిద్ర. ఈ NREM నిద్రలో మూడు చిన్న చిన్న దశలు ఉంటాయి. వాటిని N1, N2, N3 అని అంటారు. మనం నిద్రలోకి ప్రవేశించే ప్రారంభ దశ N1. ఇది ఒక చాలా తేలికైన నిద్ర. ఈ దశలో మనల్ని చాలా సులభంగా మేల్కొలపవచ్చు. ఈ దశలో మన శరీరం సడలడం ప్రారంభిస్తుంది, మన మెదడు కూడా నెమ్మదిగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఈ దశ కొన్ని నిమిషాల పాటు ఉంటుంది.

ఇక N2 అనేది మన నిద్రలోకి మరింత లోతుగా వెళ్లే దశ. ఈ దశలో హృదయ స్పందన నెమ్మదిగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా కొద్దిగా తగ్గుతుంది. ఇది శరీరానికి చాలా అవసరమైన విశ్రాంతిని ఇస్తుంది. మనం ఒక రోజంతా చేసిన పనుల వల్ల కలిగిన అలసటను ఈ దశలో మన శరీరం తొలగిస్తుంది. ఈ దశ సుమారు 20 నిమిషాలు ఉంటుంది. మనం నిద్రపోయే మొత్తం సమయంలో ఎక్కువ భాగం ఈ దశలోనే గడుస్తుంది.

ఇకపోతే N3 నిద్రను గాఢ నిద్ర అని అంటారు. ఈ దశలో మన శరీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దశలో మనల్ని మేల్కొలపడం చాలా కష్టం. గాఢ నిద్ర మన శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దశలోనే మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. మన రోగ నిరోధక శక్తి కూడా ఈ దశలో బలపడుతుంది. మనం N3 దశలో ఎక్కువ సేపు ఉంటే మనకు అలసట అనిపించదు. బదులుగా మనం ఉదయం లేచినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది గాఢంగా నిద్రపోవడం లేదు చెడు అలవాట్ల బారిన పడి నిద్ర నువ్వు శాక్రిఫై చేస్తున్నారు. అలా చేస్తే భవిష్యత్తులో అనేకమైన ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: