ఎందుకంటే, అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మొదటగా మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. క్రమంగా గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఆ తరువాత శ్వాస క్రియ కూడా నెమ్మదించి కొన్నిసార్లు మరణానికి దారితీయవచ్చు. బేసిగ్గా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కాలేయం పాడవుతుంది అని ఎక్కువమంది భావిస్తూ ఉంటారు. అయితే ఆల్కహాల్ వలన ఒక్క కాలేయం మాత్రమే కాకుండా మిగతా శరీర భాగాలు కూడా దెబ్బ తింటాయని చెబుతున్నారు. దానికి ఉదాహరణంగా ఓ తాజా కేసు గురించి చెప్పుకొచ్చారు.
40 సంవత్సరాలు కలిగిన మద్యం సేవించే వ్యక్తి ప్రస్తుతం వెంటిలేటర్ పై చావుబతుకుల మీద ఉన్నాడు. అతని శరీర భాగాలను పరిశీలించిన డాక్టర్స్... ఆ వ్యక్తి మెదడులో రక్తస్రావం జరిగి, పుర్రె లోపలి మెదడు కణజాలం అంతా పూర్తిగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. దాంతో ఇక అతనిని బతికించడం కష్టం అని డాక్టర్స్ చేతులెత్తేశారు. దీనినే ఉదాహరణగా చూపిస్తూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే... అస్సలు మద్యం మొత్తానికే తాగకపోవడం అనేది అన్ని విధాలా మంచిది అని చెబుతున్నారు. ఎందుకంటే, మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే అన్ని దుష్ప్రభావాల తీవ్రత అంత ఎక్కువ ఉంటుంది.