మనలో చాలామంది ఆడ, మగ అని తేడా లేకుండా చాలామంది కొన్ని సందర్భాలలో పొట్టిగా ఉన్నామని ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అయితే పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల హైట్ పెరుగుతారని మన పూర్వీకుల నుంచి కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈ పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల నిజంగానే హైట్ పెరుగుతారా లేదా అనే విషయంపై ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



పొట్లకాయల చాలానే పోషక గుణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్తో పాటు పిండి పదార్థాలు ప్రోటీన్ వంటి పదార్థాలు కూడా కలిగి ఉంటాయి.. ఇక విటమిన్స్ విషయానికి వస్తే ఏకంగా..A,B1,B2,B3,B6,B9, C వంటి వాటితో పాటుగా క్యాల్షియం మెగ్నీషియం జింక్ ఇతరత్రా ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే మనం తినేటువంటి ఆహారాన్ని కూడా ఇవి చాలా త్వరగా జీర్ణం చేస్తాయట. ఇందులో కొవ్వు కూడా ఎక్కువగా ఉండదు. పొట్లకాయ జ్యూస్ ను కానీ కూరను కాని తినడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.


పొట్లకాయ జ్యూస్ ను తాగడం వల్ల కొంతమేరకు మాత్రమే హైట్ పెరగొచ్చు అని పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు.. అయితే ఈ జ్యూస్ తాగిన వెంటనే ఏదైనా వ్యాయామం చేస్తూ ఉండాలట.. కానీ వీటిని ఎక్కువగా తాగడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయట. పొట్లకాయ జ్యూస్ చాలా చేదుగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తాగితే కచ్చితంగా గ్యాస్ వంటి సమస్యలను సృష్టిస్తుంది. పచ్చి పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల కడుపులోని సమస్యలను కూడా తగ్గిస్తుందట. పొట్లకాయలు చాలానే పోషకాలు సైతం లభిస్తాయి. అందుకే పొట్లకాయను అటు కూరలో వేసుకున్న ఫ్రై గా చేసుకున్న జ్యూస్గా తాగినా కూడా పలు రకాల లాభాలు ఉంటాయి. అయితే ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ.. అలర్జీ వంటివి ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: