అందమైన చందమామలా ఉండాలని కోరుకోని అమ్మాయి ఉండదు. కానీ, మొటిమలు, నల్లటి మచ్చలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వంటి సమస్యలు.. ముఖాన్ని అందవిహీనంగా మారుస్తూ ఉంటాయి. అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్యల్లో బ్లాక్హెడ్స్ ఒకటి. ఈ బ్లాక్ హెడ్స్ తొలగిచడానికి ఫేస్ స్క్రబ్, బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఫేస్ వాష్, క్రీమ్లు వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు.. ఈ సమస్యను తొలగించుకోవడానికి పార్లర్లకు కూడా వెళ్తూ ఉంటారు. దీని కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంట్లో దొరికే వస్తువులతోనే బ్లాక్హెడ్స్ను ఈజీగా రిమూవ్ చేయవచ్చు.బ్లాక్ హెడ్స్ తొలగించుకునేందుకు ఈ చిట్కా మీకు బాగా హెల్ప్ చేస్తుంది. కేవలం తక్కువ పదార్థాలతో.. తక్కువ సమయంలోనే బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవచ్చు. మరి అవేంటి? వాటితో ఎలా బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక టమాటాను అడ్డంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓ చిన్న గిన్నెలో ఒక స్పూన్ పంచదారను తీసుకోండి. ఇప్పుడు ఆ టమాటా ముక్కను పంచదారలో అద్ది బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దాలి. ఇలా నిమిషం పాటు చేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. నెక్ట్స్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఓ సారి చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. అలాగే ఫేస్ కూడా అందంగా కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో నే జామాకు, కలబంద బ్లాక్హెడ్స్ను తొలగిస్తాయి. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ జామాకు పేస్ట్ని తీసుకోవాలి. దానికి అంతేమొత్తంలో కలబంద గుజ్జు, చిటికెడు పసుపుని కలపాలి. ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.ఇటువంటి చిన్న టిప్స్ వల్లఇంట్లోనే ఉండి పైసా ఖర్చు లేకుండా మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: