మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలలో, కాయగూరలలో చాలా పోషకాలు ఉన్నవి.. అలా మనకి దొరికేటువంటి వాటిలో జామ ఆకులు కూడా ఒకటీ. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఎవరైనా సరే ఈ ఆకుని నమ్మడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయట.. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు వీటిని నమలడం వల్ల ఉపశమనం పొందుతారని జామ ఆకుల టీ తాగడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయట. ముఖ్యంగా డయేరియాతో ఇబ్బంది పడేవారు జామ ఆకు టీ తాగితే సమస్యను తగ్గించుకోవచ్చట.


జామ ఆకులలో ఉండేటువంటి ఖనిజాలు విటమిన్స్ శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ప్రోటీన్స్ విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.


ఎప్పుడైనా సరే జామ ఆకు టీను తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకును తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.. ఈ జామ టీ తాగడం వల్ల బేబీ కంట్రోల్లో ఉంటుందట. అలాగే శరీరంలో మెటబాలిజం రేటు కూడా తగ్గిపోతుందని.. గర్భిణీ స్త్రీలకు జామ ఆకుల టీ కానీ , జామ ఆకులను తగకపోవడం మంచిదట.


జామ ఆకులలో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ ,మైక్రోబియల్స్ వంటివి ఉంటాయి ఇవి రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని సైతం అదుపులో ఉంచేలా చేస్తాయి. ఈ జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిలోకి కాస్త తేనె, నిమ్మకాయను పిండుకొని తాగితే.. కడుపులో ఉన్న చెడు మలినాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయట.


జామ ఆకుల టీని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మెరబడమే కాకుండా ముఖంపై ఉండే మచ్చలు కూడా పోగొట్టేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-C వంటిది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: