మెంతి ఆకుకూరలో యాంటీ డయాబెటిస్ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెంతి గింజలలో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయట. అందుకు సంబంధించి సౌదీ అరేబియాలో ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయట. ఇందులో యాంటీ కాన్సర్, యాంటీ పరాసిటిక్, హైపో కొలస్ట్రాలేమిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఫెర్టిలిటీ ఇతరత్ర లక్షణాలు మెంతి ఆకులలో చాలా ఉన్నాయని తెలియజేశారు. ప్రతిరోజు ఆహారంలో ఈ ఆకుకూరను చేర్చుకోవడం వల్ల ప్రోటీన్స్ ఫైబర్ వంటివి పుష్కలంగా శరీరానికి అందుతాయట.
మధుమేహంలో మెంతి ప్రయోజనాలు విషయానికి వస్తే టైప్-1, టైప్-2 డయాబెటిస్ కి జీర్ణక్రియ లక్షణాలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందట. దీనివల్ల రోగులు రక్తంలో ఉండే చక్కెర స్థాయిని సైతం తగ్గించేలా చేస్తుంది.
టైప్ -1 డయాబెటిస్ రోగులు ప్రతిరోజు ఆహారంలో 100 గ్రాముల మెంతి పొడిని గింజలను తీసుకున్నట్లు అయితే చెడు కొలెస్ట్రాల్, ఎల్ డి ఎల్, తగ్గుతుందని పరిశోధకులు ఇటీవల తెలియజేశారు.
మెంతిలోని ఉండే యాంటీ వైరల్ వల్ల గొంతు నొప్పి నుంచి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తాయట. అలాగే జుట్టు రాలే వాళ్లకు కూడా పెరిగేలా చేస్తుందని మలబద్ధక సమస్య, మూత్రపిండ వ్యాధి, పేగు ఆరోగ్యం, లైంగిక సమస్యలు ఇతరత్రా వాటిని మెంతి ఆకుకూరలు ప్రభావితం చేస్తాయట.. ఈ మెంతి ఆకులతోనే కాకుండా నీరు, చట్నీ, ఫ్రై చేసుకుని తిన్నా కూడా పలు రకాల వాటిల్లో వేసుకొని తిన్నా కూడా ఉపయోగం ఉంటుందట.