అయితే ఇలాంటి దుస్తుల వల్ల శరీరాకృతి స్పష్టంగా ప్రదర్శించుకున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట. ముఖ్యంగా టైట్ దుస్తులు చర్మం పైన చాలా ఒత్తిడిని తీసుకువస్తాయని ఇవి రక్తప్రసరణ పైన చాలా ప్రభావితాన్ని చేస్తాయట. నరాల దెబ్బ తినడానికి కూడా ఆస్కారం ఉంటుందని దీనివల్ల పిల్లలు పుట్టడం పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని కలిగించేలా చేస్తాయట.
బిగువైన దుస్తులు ధరించడం వల్ల చర్మం పైన ఎక్కువగా దద్దుర్లు వచ్చి దురద చికాకు వంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా తొడలు , ప్రైవేట్ పార్ట్ల వద్ద చాలా సమస్యలు ఎదురవుతాయట.
బిగువైన దుస్తులు ధరించడం వల్ల గాలి దూరదు దీనివల్ల చాలా భాగాలలో ఫంగస్ పెరుగుదలకు కారణమవుతుందట. దీనివల్ల దురద లేదా అథ్లెట్స్ వంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయట.
బిగువైన దుస్తులు చర్మానికి అతుక్కొని ఉంచడం వల్ల ఇవి చెమట నూనెలను సైతం ఎక్కువగా బంధిస్తాయి ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయట. దీని ఫలితంగానే చర్మం పైన చాలా మొటిమలు ఏర్పడడానికి కారణం అవుతాయట.
టైట్ బెల్ట్ ప్యాంటులు, స్కర్ట్ లు ధరించడం వల్ల చర్మం సున్నితత్వాన్ని సైతం కోల్పోతుందట. దీనివల్ల రక్తప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అందుకే సౌకర్యవంతమైన దుస్తులను ధరించడమే ముఖ్యము.