ఎవరైనా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండేవారు గుమ్మడి గింజలు తినడం వల్ల ఇందులో ఉండే అమినోయాసిడ్ మంచి నిద్రను కలిగించేలా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే జింక్ కాపర్ లాంటిది నిద్ర నాణ్యతను కూడా పెంచడానికి సహాయపడతాయట. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. హై బీపీతో ఇబ్బంది పడేవారు వారానికి రెండు మూడు రోజులు వీటిని తినడం వల్ల చాలా ఉపయోగం ఉన్నది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట.
గుమ్మడి గింజలను ఏదైనా స్నాక్స్ రూపంలో కానీ లేకపోతే వేపుడు గా వేయించుకొని తినడం వల్ల చాలా మంచిది. ఇందులోని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని తిన్నా కూడా కడుపు నిండుగా అనిపిస్తుంది. తరచూ వీటిని తింటూ ఉండడం వల్ల గుండెపోటు మరణాన్ని సైతం తగ్గించుకోవచ్చు. గుమ్మడి గింజలలో పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఇన్సులిన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుమ్మడి గింజలలో సహజంగానే జింక్ ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది.. ఇది ఎముకలని సైతం బలంగా ఉంచేలా చేస్తాయి.. వయసు పెరిగే కొద్దీ ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవాలి అంటే ఈ గుమ్మడి గింజలను తినడం చాలా ఉత్తమం. ఇలా ఎన్నో సమస్యలను సైతం గుమ్మడి గింజలు దూరం చేస్తాయి.