అందుకే చలికాలం వచ్చిందంటే చాలు కాస్త వెచ్చగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ మంటలు వేసుకొని కాచుకోవడం లాంటివి కూడా చూస్తూ ఉంటాము. అయితే చలికాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే ఇక రోడ్డుమీద వేడివేడిగా కనిపించే కొన్ని ఆహారాలను తీసుకుంటారు. ఆ సమయంలో ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోరు. అందుకే చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ డాక్టర్లు తినకూడదు అని చెబుతున్న ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చలి కాలం లో మారిన వాతావరణానికి అనుగుణం గానే శరీరాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అంటూ సూచిస్తున్నారు. చెక్కర కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా చల్లగా ఉండే వాటిని వీలైనంతవరకు తినకుండా ఉండడమే ఎంతో మంచిది అంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా మాంసాహారం కూడా తక్కువగా తీసుకోవాలని.. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి అంటూ చెబుతున్నారు నిపుణులు.