ఇటీవల కాలంలో ప్రజల జీవన శైలిలో కూడా రోజురోజుకి మారుతూనే ఉంది. వృత్తిపరమైన ఒత్తిడిల వల్ల లేకపోతే వ్యక్తిగత కారణాలవల్ల చాలా మానసికంగా కూడా అలసిపోతున్నారు. ఈ విధమైన జీవనశైలి వివిధ అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తున్నదట. ముఖ్యంగా తలనొప్పి అనేది సాధారణ సమస్యగా వదిలి పెట్టకూడదు. ఇది ఏ వయసులో సంభవించిన కూడా చాలా ఇబ్బందులేనట. కొంతమందికి అప్పుడప్పుడు రావచ్చు. కానీ ఇది ప్రతిరోజు చేసేటువంటి పనుల  మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి పడడం, ఆందోళన ,అలసట, ఎక్కువ పని చేయడం, చెడు అలవాట్ల కారణాలవల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుందట.


అయితే చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడు ఈ నొప్పి తగ్గడానికి టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అలాగే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు కూడా దుష్ప్రభావాలను సైతం కలిగిస్తాయట. ఇలాంటి సమయంలో తలనొప్పిని తగ్గించడానికి మాత్రలకు బదులుగా కొన్ని హోమ్ రెడిమేస్ని ఉపయోగించడం వల్ల తలనొప్పిని దూరం చేసుకోవచ్చట. వాటి గురించి చూద్దాం.


1). మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే లోపు కచ్చితంగా ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగడం వల్ల తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.


2) తలనొప్పి వచ్చినప్పుడు అల్లం టీ తాగడం వల్ల కాస్త నెమ్మదిగా తగ్గిపోతుందట ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు తలనొప్పి తగ్గడానికి మానసిక నొప్పి నుంచి కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుందట.


3). ఎవరికైనా తలచుగా తలనొప్పి వస్తూ ఉంటే విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమట. ఇది ఏ వయసులో వారికైనా సరే ప్రమాదం కాబట్టి ఎక్కువగా నిద్రపోవడం మంచిది.


4). ఎలాంటి మానసిక ఒత్తిడి ఆందోళన పడకుండా ఉండేందుకు చాలా మంది యోగ ధ్యానం వంటివి చేస్తూ ఉంటారు.


ఎక్కువగా టీవీ చూడడం మొబైల్ చూడడం వంటి వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది వీటిని వీలైనంతవరకు తగ్గించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: