పొన్నగంటి ఆకుకూరలో అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలు కూడా ఉన్నాయట. ఈ ఆకుకూరలలో బీటా కెరోటిన్, క్యాల్షియం, ఫైబర్ కంటెంట్ తో పాటు విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయట. ఈ ఆకు కూరను తినడం వల్ల ఎముకలు చాలా దృఢంగా తయారవ్వడానికి సహాయపడుతుందట. ఎవరైతే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నా,కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నారో వారికి చాలా ఉపయోగపడుతుందట. తీవ్రమైన తలనొప్పుతో ఇబ్బంది పడేవారు ఈ ఆకుకూరను తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని సైతం పెంచడానికి అలాగే సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకుకూర రసంలోకి కాస్త తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు దగ్గు వంటి సమస్యలు దరి చేరవట. అలాగే రక్తపోటుని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది గుండె ఆరోగ్యంగా మెరుగుపరచడమే కాకుండా రక్తంలో ఉండే కొవ్వు స్థాయిని సైతం అదుపులో ఉంచేలా చేస్తుందట.. ఈ ఆకు రసాన్ని చేతిలో పిండుకొని ముఖానికి రాసినట్లు అయితే మచ్చలు, మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. అలాగే చర్మం రంగు కూడా మెరుగుపడుతుందట. ఈ ఆకుకూరను వారంలో ఒకసారి లేదా రెండుసార్లు ఆయన తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.