ప్రతిరోజు వ్యాయామం చేయడం మనిషికి ఎంతో మంచిది. ఇలా చేయడం ద్వారా ఒక వైపు శారీరక దృఢత్వంతో పాటు ఇంకోవైపు అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఇలా వ్యాయామం చేయడం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని చెబుతూ ఉంటారు నిపుణులు. ఎందుకంటే చాలామంది ఇటీవల కాలంలో అటు పని ఒత్తిడితో సరై ఇంకా నిద్ర పోవడం లేదు.


 డాక్టర్లు సూచించిన విధంగా 7 నుంచి 9 గంటల పాటు అస్సలు నిద్రపోవడం లేదు. రాత్రి సమయంలో కూడా ఏకంగా మొబైల్ వాడటం కారణంగా ఇలా సరైన నిద్ర ఉండడం లేదు. అయితే కొంతమంది ఇలా సరిగా నిద్ర పోకపోయినప్పటికీ కూడా ఏకంగా వ్యాయామం చేయడం చేస్తూ ఉంటారు. ఇలా నిద్రలేమిటో వ్యాయామం చేస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి ప్రతిరోజు సరైన వ్యాయామం ఎలా ఉండాలో.. దానికి ముందు సరైన నిద్ర కూడా అలాగే మనిషికి ఎంతో అవసరం అంటూ సూచిస్తూ ఉన్నారు.


 సాధారణంగా ఇలా ప్రతిరోజు ఉదయమే లేచి వ్యాయామం లేదంటే వాకింగ్ చేసే వాళ్ళు నాలుగు నుంచి ఐదు గంటల మధ్య నిద్ర లేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా నాలుగు నుంచి ఐదు గంటలకే లేచి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదా అనే ప్రశ్న ఒక డాక్టర్కు ఎదురయింది. ఇక ఈ ప్రశ్నపై డాక్టర్ సుధీర్ కుమార్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. అందరికీ ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. నిత్యం తక్కువ నిద్రపోయి ఎక్కువసేపు వ్యాయామం చేయడం అస్సలు మంచిది కాదు. వ్యాయామం చేసే ముందు ఇక సరిపడా నిద్ర ఉందా లేదా అన్న విషయాన్ని కూడా చూసుకోవాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: