చాలా మంది మనలో జీడిపప్పు తినడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం వీటిని తింటే ఎక్కువగా క్యాలరీలు పెరుగుతాయని తినడం మానేస్తూ ఉంటారు. జీడిపప్పులో ఒమేగా-3 ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది అందుకే బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి ఈ కాజు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ,మెగ్నీషియం, కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల శరీరంలో మంచి కొవ్వు పెరగడానికి సహాయపడతాయి.


అలాగే కాజులో ఉండే మెగ్నీషియం రక్తపోటు నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా చాలా లాభాలు ఉన్నాయి కాజువల్ల..కానీ జీడి మామిడి పండు గురించి చాలామందికి తెలియకపోవచ్చు.. తినడానికి కాస్త రుచిగా ఉన్నప్పటికీ దీన్ని రసం పలుచగా ఉండడం వల్ల ఇది తాగడానికి కొంత పులుపు వగరుని కలిగి ఉంటుంది. ఈ పండు రసం తాగడం కొంతమందికి అసలు పడదు.అందులో ఉన్న రసం వల్ల కొంతమంది గొంతులో గరగర అనడం మొదలవుతుంది. మరి కొంతమందికి దగ్గు కూడా వస్తుంది. దీనిని కొన్ని సందర్భాలలో రసం, సాంబారు వంటి వాటి వల్ల ఉపయోగిస్తారట.



జీడి మామిడిలో ఉండే ఆమ్లాలు దంత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.. ఇది హానికరమైన  బ్యాక్టీరియాను కూడా చంపుతాయట. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క యొక్క వేర్లతో వైద్యం కూడా చేస్తున్నారట.
జీడి మామిడి యొక్క కాయలను పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారట. అలాగే జీడి మామిడి యొక్క ఆయిల్ ను కాళ్ళ పగులకు కూడా ఉపయోగిస్తారట. జీడి మామిడి జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఉండే వ్యర్ధపదార్ధాలు బయటికి వచ్చేస్తాయట. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయి.. అయితే జీడి మామిడి పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు ఇది చాలా ప్రమాదం దీని రసం దుస్తుల మీద పడ్డా కూడా చెరిగిపోదట.. మాగిన తర్వాత మాత్రమే జీడి మామిడిని తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: