మన భూమిపై ఎన్నో సముద్రాలు ఉన్నాయి ఆ సముద్రాలలో కొన్ని కోట్ల జీవరాసులు ఉన్నాయి. వీటిలో లక్షల జాతుల్లో చేపలు ఉన్నాయి. వీటిలో అనేక రకాల చేపలను ప్రజలు తింటుంటారు కానీ కొన్ని రకాల ఫిష్ తినకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అలాంటివి ఏం ప్రమాదకరమైన చేపలలో సలేమా పోర్గీ ఒకటి. ఈ చేపను చూస్తే అది ఒక సాధారణ చేపలానే కనిపిస్తుంది. కానీ, ఈ చేపకు మనకు ఆశ్చర్యం కలిగించే ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఈ చేపను తింటే, మనకు 36 గంటల వరకు హలోజినేషన్స్‌ అంటే భ్రాంతులు, భ్రమలు వస్తాయి.

ఈ సలేమా పోర్గీ చేప తింటే భ్రమలు వస్తాయనే విషయం చాలా కాలంగా తెలుసు. పురాతన రోమన్లు కూడా ఈ చేపను తింటే భ్రమలు కలుగుతాయని తెలుసుకుని, ఈ చేపను తింటూ ఆ అనుభూతిని అనుభవించేవారు. ఈ కారణంగానే ఈ చేపకు 'డ్రీమ్‌ఫిష్‌' అని పేరు పెట్టారు. ఈ చేపను తినడం వల్ల కలిగే ఈ అనుభూతిని కొంతమంది మందులు వాడే విధంగానే వాడేవారు.

సలేమా పోర్గీ చేప హలోజినేషన్స్‌ లక్షణానికి కారణం ఆ చేప మాంసంలో ఉండే విషపదార్థాలేనని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ విషపదార్థాలు ఆ చేప తినే ఆల్గే, పాచి ఉన్నాయి నుంచి వస్తాయి. ఈ ఆల్గే, ప్లవకాలు హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ విషపదార్థాలు చేప శరీరంలో పేరుకుపోయి, మనం ఆ చేపను తింటే మనకు చాలా తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తాయి.

పురాతన రోమన్లు ఈ చేపను తిని ఆనందించడానికి, సరదాగా గడపడానికి తినేవారు. నేడు చాలా మంది సలేమా పార్గీ చేపను తిని కలలు వచ్చే అనుభూతిని అనుకోకుండా ఎదుర్కొంటున్నారు. ఈ చేపను తిన్న తర్వాత ప్రకాశవంతమైన దృశ్యాలు, ఆడియో మాయలు, గందరగోళం వంటి అనుభవాలను ఎదుర్కొన్న వారి గురించి నివేదికలు ఉన్నాయి. ఈ చేప అసాధారణ లక్షణాల గురించి తెలియని వారికి ఈ ప్రభావాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే వీటి గురించి తెలుసుకొని వీటిని తినకుండా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: