రాత్రి సమయాలలో బట్టలు ఉతుకుతున్నట్లు అయితే ఆ బట్టలను బయట ఆరువేయకూడదు. ఇది వారి యొక్క ఆనందాన్ని తగ్గిస్తుందట.
సూర్యుడు వచ్చిన తర్వాత బట్టలను ఉతికి ఆరీ వేయడం వల్ల సూర్యకాంతిలో ఆరబెట్టడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు. ఇలా ఎండలో ఆరబెట్టడం వల్ల మీకు తగిలినటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. వీటికి తోడుగా మీ బట్టల మీద ఉండేటువంటి సూక్ష్మ క్రిములు కూడా ఆ ఎండకి నశిస్తాయట. అందుకే ఎండలో ఆరబెట్టిన దుస్తులను వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
వాస్తు ప్రకారం రాత్రి సమయాలలో ఎక్కువగా ప్రతికూల శక్తి ఉంటుందట అందుకే రాత్రిపూట బట్టలు ఉతకడం కాని బయట ఆరబెట్టడం వంటివి చేస్తే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఆ బట్టలకి సోకి దీనివల్ల వేసుకున్న వారు కూడా ఇబ్బందులు ఎదురవుతుందట.
చల్లని దుస్తులలో ఉండే క్రిములు కూడా చల్లని వాతావరణం లో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి దీనివల్ల ఆరోగ్యం కూడా హానికరంగా మారుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా రాత్రి సమయాలలో సరిగ్గా ఆరకపోతే ఆ దుస్తులు కూడా కాస్త దుర్వాసన వస్తాయి. దీనివల్ల స్కిన్ అలర్జీలు వంటివి ఎదురవుతాయి. అందుకే రాత్రి సమయాలలో బట్టలు ఉతికిన తర్వాత ఉదయం వేసుకోకపోవడమే చాలా ఉత్తమమం.