కొన్ని సందర్భాలలో ఈ మస్కిటో కాయిల్స్ వాసన పీల్చినట్లు అయితే తలనొప్పి వంటివి ఎక్కువగా వస్తుందట. ఈ పొగను పీల్చడం వల్ల ఎలర్జీ సమస్యలు ఎదురవుతాయని అందుకే చాలా మంది ఈ పొగకు దూరంగా ఉండడమే మంచిది అంటూ తెలియజేస్తూ ఉంటారు. ఈ మస్కిటో కాయిన్స్ లలో క్యాన్సర్ కారకాలకి గురి చేసే రసాయనాలు ఎక్కువగా ఉంటాయట ఇవి ఊపిరితిత్తులను క్యాన్సర్ కారణానికి గురయ్యేలా చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మస్కిటో కాయిల్స్ పొగను ప్రతిరోజు పిలిస్తే ఖచ్చితంగా ఆస్తమా వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎవరింట్లో అయినా పిల్లలు ఉంటే వీటిని చాలా దూరంగా ఉంచడమే మంచిది.
పిల్లలు కూడా ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయట.. ఈ పొగ ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులలో అడ్డంకులు వచ్చినట్లుగా ఇబ్బందులకు గురి చేస్తుందట. అందుకే మస్కిటో కాయిల్స్ ని ఉపయోగించుకోకుండా ఉండడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోమలు నివారించడానికి సైతం కొన్ని సహజమైన చిట్కాలను ఎంచుకోవడమే ఉత్తమ మాట దోమ తెరలు వేసుకొని పడుకోవడం ఉత్తమమైన మార్గమని నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. లేకపోతే సహజ సిద్ధమైన కర్పూరం పొగ, వేపాకు పొగ వంటివి వేయడం వల్ల చాలా మంచిదని తెలియజేస్తున్నారు. అందుకే ఈ మస్కిటో కాయిల్స్ పొగని ఎంత వీలైతే అంత తగ్గించడం మంచిది.