ఈ భూమ్మీద ఉండే జీవుల్లో విషపూరితమైన జీవులు ఏమిటి అంటే పాములు, తేలు సహా మరికొన్ని జీవుల పేర్లు చెబుతూ ఉంటారు. అలాంటి పేర్లలో బల్లి పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేంటి అందరూ ఇళ్లల్లో ఉండే బల్లి నిజంగా విషపూరితమైనదా అంటే మాత్రం ఏమో మరి మాకు కూడా తెలియదు. కానీ అందరూ అదే అంటుంటారు కదా.. బల్లి విషపూరితమైనది. ఎక్కడైనా వంటల్లో  పడింది అంటే ఆ వంటలను అస్సలు తినకూడదు అని చెబుతూ ఉంటారు. మేం కూడా అదే ఫాలో అవుతున్నామని ప్రతి ఒక్కరి నోటి నుంచి మాట వినిపిస్తూ ఉంటుంది.


 మరి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కనిపించే బల్లులు నిజంగా విషపూరితమైన జీవులేనా అంటే మాత్రం నిజం చాలామందికి తెలియదు. అయితే బల్లులను విషపూరితమైన జీవులు అని పిలుచుకోవడమే కాదు అపశకునంగా కూడా భావిస్తూ ఉంటారు. ఒకవేళ బల్లి మీద పడింది అంటే చాలు బల్లి దోషం ఉంది అంటూ చెబుతూ ఉంటారు. ఏకంగా స్నానం చేసి గుడికి వచ్చేంతవరకు కూడా తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇక ఆహారంలో పడితే ఆహారం విషపూరితం అయిందని పారవేయడం కూడా చేస్తూ ఉంటారు.


 కానీ బల్లుల్లో మనుషులను చంపేంత విషం ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు అని.. ఇప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో కూడా తేలింది. కానీ ఒక్కోసారి బల్లి పడిన ఆహారం తీసుకుంటే వాంతులు తలనొప్పి కలగవచ్చు అని చెబుతూ ఉన్నారు నిపుణులు. కానీ ఇవి అలర్జీల వల్లే వస్తాయి అంటూ చెబుతున్నారు. ఇళ్లల్లో ఉండే బల్లులు కరిచినప్పటికీ కూడా మనుషులకు ఏం కాదు అంటూ చెబుతున్నారు. ఒకవేళ బల్లి కుడితే  భయాందోళనకు గురై కంగారుపడి ఏదో చేయకుండా ముందుగా ఫస్ట్ అయిడ్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లాలి అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: