అయితే కొంతమంది ఇలా ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం..చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకునేందుకు కారణం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా బంగాళదుంపలు అనేవీ ప్రతి ఒక్కరి ఆహారంలో ఒక భాగంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే బంగాళదుంపలతో ఎన్నో రకాల వంటకాలు వండుకుంటూ ఉంటారు. ఇతర వంటకాలలో వీటిని భాగం చేస్తూ ఉంటారు. అయితే బంగాళదుంపలను కొనుగోలు చేసే విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు అనారోగ్య సమస్యలను చేస్తూ ఉంటాయి అని అంటూ ఉన్నారు నిపుణులు.
చాలామంది బంగాళా దుంపలను తెచ్చుకుని ఎన్నో రోజులపాటు ఇంట్లో నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న బంగాళదుంపలు కొన్ని రోజులకే మొలకెత్తుతూ ఉంటాయి. అయితే వాటిని పట్టించుకోకుండా వండుకొని తినేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి వాటిని తినడం వల్ల వికారం తలనొప్పి జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన బంగాళదుంపలు సోలనిస్ & చాకోనిస్ వంటి సహజమైన టాక్సీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే చిన్నగా మొలకలు వస్తే వాటిని కట్ చేసి వంట చేసుకోవచ్చని కానీ పెద్దగా మొలకెత్తితే మాత్రం వాటిని అస్సలు తినకూడదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.