ఈ పదార్థాలను వేడి చేసి ఊపిరితిత్తులలోకి తీసుకున్నప్పుడు, అవి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తులను చికాకు పెట్టి, ఆక్సిజన్‌ను తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి. ఈ-సిగరెట్లు మన శరీరంలోని నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. రోజూ ఇవి వాడటం వల్ల తలనొప్పి, తల తిరుగుట, హార్ట్ బీట్ పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల వాపు లేదా ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలంగా వేపింగ్ చేస్తే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇంకో విషయం ఏంటంటే, యువతపై వేపింగ్ ఎలా ప్రభావం చూపుతుందనేది. చాలా మంది యువత ఇ-సిగరెట్లు హానిచేయవు అని అనుకుంటూ వాడతారు. కానీ, వేప్ ద్రవంలో ఉండే రసాయనాలు వారి అభివృద్ధి చెందుతున్న మెదడుకు హాని చేస్తాయి, అలవాటు పడే అవకాశాన్ని పెంచుతాయి. నికోటిన్, తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ, చాలా ఎక్కువగా అలవాటు చేస్తుంది. ఒకసారి అలవాటు పడితే మానేయడం చాలా కష్టం, ఇది జీవితాంతం అలవాటుగా మారిపోవచ్చు.
ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, వాటి తయారీ, విక్రయంపై కూడా సరిపడా నియంత్రణలు లేవు. తయారీదారులు వేపింగ్‌ను ఆకర్షణీయంగా చేయడానికి అనేక రకాల రసాయనాలను జోడిస్తారు. కానీ ఈ రసాయనాలన్నీ సురక్షితమో లేదో పరీక్షించరు. వేపింగ్ చేసేటప్పుడు వెలువడే ఆవిరిలో లెడ్, నికెల్ వంటి లోహాలు కూడా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు హాని కలిగిస్తాయి.
వేపింగ్ హాని చేయదని అనుకుంటున్నారా? అయితే మళ్లీ ఆలోచించడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నార్మల్ సిగరెట్లు, వేపింగ్ రెండింటినీ నివారించాలని సలహా ఇస్తున్నారు. ఈ హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీర్ఘకాలికంగా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి సహాయపడే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి.