అయితే జుట్టు రాలుతున్న సమయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇక ఎంతో మంది డాక్టర్లు చుట్టూ తిరిగినప్పటికీ అటు జుట్టు రాల సమస్య నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. దీంతో పాతికేళ్లు కూడా నిండకముందే పైన పెద్ద క్రికెట్ గ్రౌండ్ తయారైపోతుంది. దీంతో అలాంటి బట్ట తలను దాచుకోలేక.. ఇక బట్టతల ఉంది అని పెళ్లి కాక.. ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే జుట్టు రాలుతున్న సమయంలో ఎంతోమంది కొన్ని రకాల నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు. అందులో గుండు చేయించుకోవడం కూడా ఒకటి.
తలపై జుట్టు రాలిపోతూ పలుచగా మారినప్పుడు గుండు చేయించుకోవడం వల్ల మళ్ళీ తలపై ఉన్న జుట్టు మందంగా మారిపోతుందని ఎంతోమంది విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఎంతోమంది ఇష్టం లేకపోయినా గుండు చేయించుకుంటూ ఉంటారు. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. ఇలాంటి నమ్మకంలో ఎలాంటి నిజం లేదు అంటూ చెబుతున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదు అంటూ చెబుతున్నారు. అయితే గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా మారే అవకాశం మాత్రం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకానీ గుండు చేయించడం వల్ల తలపై వెంట్రుకల సంఖ్య పెరగదు అంటూ చెబుతున్నారు.