కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి దాదాపుగా ఐదేండ్లు అవుతున్నా ఇప్పటికీ కరోనా వైరస్‌ గురించి రోజూ ఏదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంది. ఇక కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చినా దీనిని నిరూపించే ఆధారాలు ఇంతవరకు లభించలేదనే విషయం విదితమే. అయితే తాజాగా, ఈ విషయంలో అమెరికా ఓ సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయి ఉండొచ్చని ఊహాగానాలు చేసింది. దాదాపు పది లక్షలమందికిపైగా అమెరికన్లను పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్‌పై రెండేళ్లపాటు సుదీర్ఘంగా జరిగిన దర్యాప్తు తర్వాత అమెరికా రిపబ్లికన్‌ నేతృత్వంలోని హౌస్‌ సెలక్షన్‌ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

అదంతా పక్కనబెడితే... కోవిడ్ బాధితుల తలలో కరోనా వైరస్ నాలుగేళ్లు నివసిస్తుందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని "సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్" అనే జర్నల్ లో సదరు విషయాన్ని ప్రచురించారు. కోవిడ్ ప్రాథమికంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ గానే మొదలు కావచ్చు, కానీ జ్ఞాపకశక్తి లేదా ఏకాగ్రత వంటి సమస్యలు దీర్ఘ కాలంలో నెలల పాటు కొనసాగవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా న్యూయార్క్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ స్కూల్‌లోని న్యూరాలజీ ప్రొఫెసర్ గియోవన్నీ షిఫిట్టో కూడా ఈ విషయాన్ని నిర్దారించారు.

ఈ నేపథ్యంలో ఆయన కరోనా వైరస్ నరాలమీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ... వాసన పూర్తిగా కోల్పోవడం, తలనొప్పి పెరగడం, అభిజ్ఞా పనిచేయకపోవడం మరియు స్ట్రోక్స్ వంటి లక్షణాలు కనబడతాయని, చెప్పుకొచ్చారు. ఇక UK కోవిడ్ మరియు కాగ్నిషన్ అధ్యయనం ప్రకారం... దీర్ఘకాల కోవిడ్ తో బాధపడినవారు రోగనిరోదక వ్యవస్థని కోల్పోతారు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేంద్ర నాడీ వ్యవస్థలోని కణాల పనితీరును కూడా ఈ వైరస్ ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధన కనుగొంది. అంతేకాకుండా 2023 అధ్యయనం ప్రకారం అయితే, కోవిడ్ సోకి తీవ్రమైన దశకి చేరుకున్నవారిలో నాడీ కణాలపై ఉండే మైలిన్ దెబ్బతిన్నాయని, ఇది అభిజ్ఞా వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: