అవును, మద్యం తాగి శృంగారం చేయడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. మద్యం మెదడుపై ప్రభావం చూపడం వలన... లైంగిక కోరిక మందగించడం, శీఘ్ర స్ఖలనం కావడంలో లైంగిక భాగస్వామి అసంతృప్తికి లోనవుతుంది. అదేవిధంగా మద్యం రక్తనాళాలను సంకోచింపజేస్తుంది, దీనివల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, లైంగిక ఉత్తేజం కూడా దారుణంగా పడిపోతుంది. అన్నింటికీ మించి... మద్యం స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మద్యం తాగి శృంగారం చేయడం వల్ల భాగస్వాముల మధ్య విశ్వాసం కోల్పోవడం, అపోహలు పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తవచ్చని లైంగిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇటువంటి కేసులు ఎక్కువైనాయని అంటున్నారు.
అందుకే మద్యం తాగకుండా ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం లైంగిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. అదేవిధంగా రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి, లైంగిక సామర్ధ్యం పెరుగుతుందని చెబుతున్నారు. అన్నింటికి మించి తగినంత నిద్ర పోవడం వల్ల శరీరం విశ్రాంతి పొంది, లైంగిక కోరిక పెరుగుతుందని అంటున్నారు. ఇంకా యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని నిర్వహించుకోవచ్చు. ఇక మద్యం తాగి శృంగారం చేయడం వల్ల కలిగే నష్టాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయని కూడా చెబుతున్నారు. ఒక్క మగవారికి కాకుండా స్త్రీలకు కూడా ఇటువంటి సమస్యలు తప్పవని అంటున్నారు.