అయితే మనలో చాలామంది వ్యాయామ నియమాలు పాటించడం వలన వెంటనే బరువు గగ్గిపోవచ్చు అనుకుంటారు. కానీ ఇది వాస్తవం అయినప్పటికీ దానికంటే ముఖ్యంగా మీరు తీసుకొనే డైట్ పై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే? మీరు తగ్గించాలి అనుకుంటున్న శరీర బరువు ఒక్కరోజులో పెరిగింది కాదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలని భావించేవారు ఒకటేసారి బరువు తగ్గాలని ప్రయత్నం చేయకుండా, నిదానంగా బరువు తగ్గడం పైనే ఎక్కువ దృష్టి సారించాలి. ఒకటే సారి బరువు తగ్గాలని చేసే ప్రయత్నాలతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
తీసుకొనే ఆహారం విషయంలో ముందుగా శ్రద్ధ వహించాలి. తీసుకునే ఆహారం వెంటనే జీర్ణం ఎదిగా ఉండాలి. అంతేకాకుండా కడుపునిండా తినడం మానుకోవాలి. ఇంకా తినగలం అని అనుకొనే లోపే ఆహారం ముగిస్తే మంచిది. అపుడు శరీరంలోని కొవ్వు కరిగి, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తరువాతే వ్యాయామం అని గుర్తుంచుకోవాలి. ఇక బరువు తగ్గాలంటే వదిలిపెట్టాల్సింది ముందు బరువుని కాదు... మీ బద్దకాన్ని. బద్దకంగా కూర్చోడం, బద్ధకంగా ఉండడం వలన శారీరక శ్రమ తగ్గి శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఏదైనా పని చేయాలంటే బద్దకిస్తూ పని చేయకుండా మానుకోవడం వంటివి చెయ్య కూడదు. బరువు తగ్గాలనుకునే వారు ఉండవలసిన ప్రధానమైన లక్షణం బద్ధకాన్ని వదిలించుకోవడం అని గుర్తు పెట్టుకోవాలి.