ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడుతున్నారు.. ఇందులో ఉండే ఔషధ గుణాలు మరెక్కడ లేవనే విషయాలను గుర్తించిన  ప్రజలు పల్లెలలో దొరికే ఆకుకూరలు తినడానికే మక్కువ చూపుతున్నారు. అలా ఎక్కడైనా సరే దొరికేటువంటి ఆకుకూరలలో గంజిరాకు కూడా ఒకటి.. ఇందులో ఎర్ర గంజిరాకు, తెల్ల గంజిరాకు అని రెండు రకాలు మాత్రమే ఉంటాయి. ఈ రెండు ఆకు కూరలను కూరలుగా చేసుకొని తినడమే కాకుండా ఆయుర్వేదం వైద్యంలో కూడా వీటి ఉపయోగం చాలానే ఉన్నది. మరి ఇలాంటి ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.



ఈమధ్య కిడ్నీ సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు ఇలాంటివారికి ఈ ఆకుకూర ఫ్రై చేసుకుని తినడం లేకపోతే కూరలలో వేసుకుని తినడం చాలా మంచిది. ఈ ఆకు కిడ్నీలను శుభ్రంగా చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటివల్ల కిడ్నీ పనితీరు కూడా మెరుగుపరిచేలా చేస్తుందట. గంజిరాకులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కిడ్నీలోని రాళ్లను సైతం బయటికి పంపించడానికి సహాయపడతాయి.


ఎవరైనా యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడేవారు ఈ గంజిరాకు తినడం వల్ల వాటికి చెక్ పెట్టవచ్చు.


ఈ గంజి రాకు లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇతర మినరల్స్ వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుందట.


గంజిరాకులో ఉండేటువంటి కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయట.. కీళ్ల నొప్పులు, కాళ్ల వాపు లక్షణాలు తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుందట.


గంజిరాకు తరచూ తింటూ ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎవరైతే కడుపు ఉబ్బరం ,అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ గంజిరాకు వాటి నుంచి ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది.


ఈ గంజిరాకు ని ఎలాంటి రూపంలో నైనా మనం తినవచ్చు ఆకుకూరలను ఎండబెట్టి పొడిగా చేసుకొని కూడా తినవచ్చట. ఈ ఆకు పల్లెలలో ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: