అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది పాత వైరస్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ వ్యాధి కొత్తది ఏమీ కాదని నడ్డ చెప్పారు. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసిఎంఆర్, ఎన్సిడిసి నిశితంగా గమనిస్తుందని వెల్లడించారు.
కనుక ఈ వ్యాధి గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ వైరస్ బారిన పడిన వారికి శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ఫ్లూ మాదిరిగా చలికాలంలో ఈ వ్యాధి వస్తుంది. హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు 2001లో మొదటిసారిగా నమోదు అయింది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది. ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు బయటి కి వెళ్లకుండా ఉంటే మంచిది. వృద్ధులు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. వైరస్ బారిన పడిన వారి నుంచి దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే... చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్..మన ఇండియాకు కొత్త కాదు కాబట్టి... లైట్ తీసుకోకూడదని కూడా పేర్కొంటున్నారు. కాస్త అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.