బెంగళూరులో ఇద్దరు చిన్నారులు, చెన్నైలో ఇద్దరు చిన్నారులు, గుజరాత్ లో ఒక చిన్నారి ఈ వైరస్ బారిన పడ్డారు. మొత్తం ఐదు కేసులు ఇప్పటివరకు నమోదు కాగా కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా మాత్రం ఈ వైరస్ కొత్త వైరస్ కాదని ఈ వైరస్ విషయంలో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 2001 సంవత్సరంలోనే ఈ వైరస్ ను గుర్తించారని సమాచారం అందుతోంది.
గాలి, శ్వాస ప్రక్రియ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది. ఈ వైరస్ ను తట్టుకునే శక్తి దేశంలోని ప్రజలలో చాలామందికి ఉందని ప్రముఖ డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిగతా శ్వాసకోశ వైరస్ ల మాదిరిగానే ఈ వైరస్ కూడా ఉంటుందని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్ కు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.
అయితే పిల్లల్లో వైరస్ కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే అప్రమత్తం అయితే మంచిది. పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. అంటు వ్యాధులను ఎదుర్కొనే విషయంలో మన దేశం ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉందనే సంగతి తెలిసిందే. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడం సాధారణం అని ఏ ఒక్క వ్యాధికారకం వల్ల కేసులు పెరుగుతున్నట్టు ఆధారాలు లేవని వైద్యులు చెబుతుండటం కొసమెరుపు.