ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం ఏంటంటే HMPV వైరస్.. చైనా నుండి పుట్టిన HMPV వైరస్ కరోనా లాగే ఉంటుంది అని డాక్టర్లు చెప్పడంతో చాలామంది వణికిపోతున్నారు.. ఇక మరికొంత మందేమో అంత పెద్ద కరోనానే జయించాం ఇది ఒక లెక్కనా అని తీసిపారేస్తున్నారు.కానీ అలా సింపుల్ గా తీసుకుంటే అందరి ప్రాణాలకి ముప్పు జరుగుతుంది.అందుకే ఈ HMPV వైరస్ కనీసం దగ్గరకి కూడా రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి హెచ్ఎంపివి వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ హెచ్ఎంపివీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్)... 2019లో బయటపడిన కరోనా వైరస్ 2020 కి ప్రపంచంతో 20-20 మ్యాచ్ ఆడింది.ఈ మధ్యనే ఈ కరోనా వైరస్ వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కరోనా ఎలాంటి గడ్డు పరిస్థితులను మనకు పరిచయం చేసి వెళ్లిందో చెప్పనక్కర్లేదు. అయితే కరోనా లాంటి మహమ్మారి నుండి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది అనుకునే సమయంలో మళ్లీ హెచ్ఎంపివి వైరస్ వచ్చి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.అయితే హెచ్ఎంపివి వైరస్ కి అంతగా భయపడాల్సిన పని లేదు అని, అనుమానమే పెనుభూతం అన్నట్లుగా ఈ వ్యాధి గురించి లేనిపోని అపోహలకు పోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


కరోనా కంటే ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటుంది అని అంతగా బెంబేలెత్తి పోవలసిన అవసరం లేదు అంటూ శాస్త్రవేత్తలతో పాటు డాక్టర్లు కూడా తేల్చి చెప్పారు.అయితే భయపడాల్సిన అవసరం లేదు అంటే పూర్తిగా అజాగ్రత్తగా ఉండకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి హెచ్ఎంపివి వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి శానిటైజర్ తో చేతులు వాష్ చేసుకున్నామో ఇప్పుడు కూడా మళ్లీ ఆ పద్ధతిని అలవాటు చేసుకుని బయటికి వెళ్లిన ప్రతిసారి ఆల్కహాల్ తక్కువగా ఉన్న శానిటైజర్ తో హాండ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలి. అందరిలో ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నా సరే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖచ్చితంగా చేతు లేకపోతే కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవాలి.

దగ్గు, జలుబు ఎక్కువ రోజులు ఉంటే కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువమంది ఉన్న ప్రదేశాలకు వెళ్లాల్సిన సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలి. అలాగే జలుబు, దగ్గు,జ్వరం వంటివి ఉన్నప్పుడు అందరిలో కలవకపోవడమే మంచిది. అలాగే ఒకరు ఉపయోగించిన హ్యాండ్ కర్చీఫ్ ని మరొకరు వాడకూడదు. అలాగే బయటికి వెళ్ళాక అలవాట్లో పొరపాటుగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ఇప్పటినుండి మానుకోండి.ఒకరు వాడిన దుస్తులను మరొకరు వాడకూడదు. టిష్యూ పేపర్లను కూడా ఒకరు యూస్ చేసినవి యూస్ చేయకూడదు. దగ్గు జలుబు జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలైన రోడ్లు వంటి వాటిపై వేయడం ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. ఇలా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే హెచ్ఎంపివీ వైరస్ దరికి చేరదు అని వైద్యుల చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: