ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసం అందరికి గుర్తుండే ఉంటుంది..ఆ మహమ్మారి మూలంగా ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారింది.. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా శవాలు.. వాటిని ఖననం చేయడానికి సరిపడ స్థలం కూడా లేకుండా పోయిందంటే ఆ మహమ్మారి ఎన్ని ప్రాణాలను హరించిందో అర్ధం చేసుకోవచ్చు..కరోనావైరస్‌ను మొదట చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబరు 1 న గుర్తించారు. 2020 మార్చి 5 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 95,000 కంటే ఎక్కువ కేసులు నిర్ధారణయ్యాయి..ఈ మహమ్మారి ఇండియా లో సైతం విజ్రుంభించింది.. ఈ మహమ్మారిని కోవిడ్ -19 గా పిలవడం జరిగింది.. ఈ వైరస్ బహిరంగంగా దగ్గిన, తుమ్మిన తుంపర్ల ద్వారా ఇతర వ్యక్తులకు సోకుతుంది.. అలాగే కరోనా సోకిన వ్యక్తిని తాకినా కూడా ఈ వైరస్ భారిన ప్రమాదం ఏర్పడింది..

ఈ మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కొన్ని సూచనలు చేసింది.. బహిరంగ దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరింది.. తమ చేతులను 20 నిమిషాల పాటు శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది.. చిన్న పిల్లలు, వృద్దులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.. ప్రపంచాన్నీ కుదిపేసిన ఈ మహమ్మారిని ప్రజలు మాస్కులు ధరించడం, వ్యక్తీగత సూచనలు పాటించడం, అలాగే వాక్సిన్ మూలంగా అదుపులోకి వచ్చింది.. ఈ వైరస్ మూలంగా అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయడం జరిగింది.. ఇండియా మొత్తం లాక్ డౌన్ విధించడంతో ప్రజల జీవనం స్తంబించిపోయింది.. ఇలాంటీ ఘోర విపత్తును ఎదుర్కున్న ప్రపంచం మరోసారి అలాంటి మహమ్మారి వైరస్ ని ఎదుర్కోబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది..

చైనాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న hmpv వైరస్ భారత్ లో కూడా జోరుగా కేసులు నమోదు అవుతున్నాయి..అయితే ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరం కాదని కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ గురించి ఎవరూ ఆందోళనపడొద్దని, ఇది కొత్త వైరస్ కాదని, దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు.2001లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలను అమలు చేస్తుందని ప్రజలకు హామీ ఇస్తూ నడ్డా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు..

HMPV గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. శీతాకాలం, వసంత ఋతువులో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని వారు తెలిపారు..కర్ణాటక, గుజరాత్‌లకు చెందిన ముగ్గురు పిల్లలకు HMPV పాజిటివ్ అని తేలిన తర్వాత జేపీ నడ్డా నుంచి ఈ ప్రకటన వెలువడింది..భారత ఆరోగ్య సంస్థలు పరిస్థితిని చురుకుగా పర్యవేక్షిస్తున్నాయని నడ్డా చెప్పారు. చైనా ఇతర దేశాల పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పరిణామాలాన్ని చూస్తుంటే దేశంలో మళ్ళీ లాక్ డౌన్ పెట్టె సూచనలు కనిపిస్తున్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. మళ్ళీ మాస్క్ లు కీలకం కానున్నాయని ఈ జీవితం మాస్క్ కే అంకితం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: