చైనా లో మొదలైన "H M P V" వైరస్ ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదుపుతుంది. ఇప్పటికే చైనా నుండి ప్రారంభమైన ఈ వైరస్ పలు దేశాల్లోకి కూడా విస్తరించింది. అందులో ఇండియా కూడా ఒకటి. ఇప్పటికే ఇండియాలో అక్కడక్కడ ఈ వైరస్ కేసులో నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వైరస్ ఎక్కువ శాతం పెద్ద వారి కంటే కూడా చిన్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని , అలాగే చిన్న వారికే ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది చెబుతూ వస్తున్నారు. ఇకపోతే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే "H M P V" వారికి సోకకూడదు అంటే మీరు చిన్న పిల్లలను తీసుకొని రద్దీ కలిగిన ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు. ఒక వేళ వెళ్లినట్లయిన కూడా కచ్చితంగా వారికి మాస్క్ ను పెట్టాలి. అలాగే చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే పెద్దవాళ్లు బయటికి ఎక్కువగా వెళ్లకూడదు. వెళ్లినా కూడా రద్దీ కలిగిన ప్రదేశాల్లో తిరగకూడదు. ఒక వేళ బయటకు వెళ్లి రద్దీ కలిగిన ప్రదేశాల్లో తిరిగినా కూడా ఇంటికి వచ్చాక చేతులు , కాళ్లను శుభ్రంగా కడుక్కొని వారు వేసుకున్న దుస్తులను ధరించి కొత్త దుస్తులను ధరించాలి. ఇక కచ్చితంగా వారు పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ ను వేయించాలి. దాని ద్వారా వారి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే తల్లి పాలను మాత్రమే ఇవ్వాలి. తల్లి పాల ద్వారా కూడా వారి ఇమ్యూనిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే "H M P V" వైరస్ బారిన వారు పడకూడదు అంటే మీరు ఈ చర్యలు కచ్చితంగా తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: