కరోనా ..ఈ పేరు చెప్పగానే చాలామంది వెన్నులో వణుకు పుడుతుంది. మూడు సంవత్సరాల క్రితం ఈ వైరస్ ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. బిడ్డలకు తండ్రులను దూరం చేసింది, తండ్రులకు బిడ్డలని దూరం చేసింది. ప్రపంచ దేశాల్లో ఎంతోమంది కళా వికలమయ్యారు. అలాంటి ఈ వైరస్  నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి హెచ్ఎంపీవీ వైరస్ పేరుతో  మరొక వైరస్ దూసుకు వస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ తో చైనా మొత్తం ఆగమాగం అవుతుంది. అలాంటి ఈ వైరస్ ఇండియాలోకి కూడా ఎంటర్ అవ్వడంతో  అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ నిర్ధారణ అవ్వడంతో, అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందట.  అలాంటి ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా..

 వైరస్ లక్షణాలు:
 సాధారణంగా ఈ వైరస్ సోకింది అంటే రోగనిరోధక శక్తి మీద దెబ్బతీస్తుందట. ముఖ్యంగా జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ, గొంతు నొప్పి రావడం ఈ వైరస్ లక్షణాలట. అయితే ఈ సాధారణంగా చాలామందికి వచ్చే లక్షణాలే కానీ ఈ వైరస్ లక్షణాలు కూడా అలాగే ఉండడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఈ వైరస్ వచ్చిన తర్వాత తీవ్రమైన జ్వరంతో మనిషి దారుణంగా డీలపడిపోతారట. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తొందరగా వెళ్లి ఆసుపత్రిలో చూపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వచ్చిన తర్వాత  శ్వాస ఆడడం ఇబ్బందికరంగా మారుతుందట. అయితే ఈ లక్షణాలు కనిపించిన రెండు రోజుల నుంచి ఐదు రోజుల్లోకి తగ్గిపోతాయి కొందరికి మాత్రం లక్షణాలు మరింత ఇబ్బంది పెడతాయట.


ముఖ్యంగా ఈ వైరస్ తుమ్మడం, తగ్గడం, శ్వాస బిందువుల, ద్వారా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. అయితే ఈ వైరస్ కు ఇప్పటివరకు కూడా వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది సోకిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇండియాలోకి ఎంటర్ అవుతున్న ఈ వైరస్ ను పూర్తిగా అరికట్టాలని, దీనికోసం ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా మాస్కు ధరించాలని, షేక్ అండ్ ఇవ్వకూడదని, అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి అని అంటున్నారు. పౌష్టికాహారం తిని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: