కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్‌ఎంపీవీ అనే వైరస్ కొత్తది కాదని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది .. అంతగా భయం ఉంటే మాస్క్ వేసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని కూడా సలహా ఇస్తుంది .. ఇక అన్ని ప్రభుత్వాలు కూడా ఇదే చెబుతున్నాయి .. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు ఈ వైరస్ వస్తే జ్వరం వచ్చిన లక్షణాలే ఉంటాయి .. చికిత్సకు వేరే ముందు లేదు దానంతటకు అదే నయమవుతుంది .. పైగా ఈ వైరస్ వచ్చినా చనిపోతారన్న దానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు .. అయినా కూడా ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి .. ఇక దీనికి ప్రభుత్వాలు ఏవో దాచిపెడుతున్నాయని వారు భావిస్తున్నారు.
ఇక కరోనా కారణంగా ప్రజల్లో ఓ రకమైన భయం వచ్చేసింది .. వైరస్ అంటే చనిపోవటమే అని అనుకుంటున్నారు. అన్నిటికీ మించి ఆ వైరస్ సోకితే ఏదో జరుగుతుందన్న ప్రచారం వైద్యం అందదన్న భయం ప్రజల్లో ఉండటం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి .. కరోనా తర్వాత కరోనా పేరుతో కొత్త వేరియంట్ అంటూ ఎన్నోసార్లు భయపెట్టే ప్రయత్నం చేశారు .. కానీ ప్రజలు అసలు పట్టించుకోలేదు .. కానీ ఈ కొత్త వైరస్ పేరుతో కొత్త ప్రయత్నం జరుగుతుంది ప్రజలు దీనిపై కొంత అప్రమత్తంగా ఉంటే చాలు .. లేకపోతే మెడికల్ మాఫియా అడ్డగోలుగా దోచేయడం కాయం.