అవును... రాత్రి త్వరగా తినేసి పడుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు మరి. రాత్రి 8 లోపు డిన్నర్ ముగిస్తే, బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు రాత్రి త్వరగా తినేస్తేనే బెటర్. లేనియెడల ఉదయం లేచి ఎంత వ్యాయామం చేసినా వృధా అని చెబుతున్నారు. డిన్నర్ త్వరగా పూర్తి చేసేసుకుని కాసేపు పోస్ట్ మీల్ వాక్ చేస్తే, పది, పదకొండు గంటల ప్రాంతంలో ఆకలి అనేది వేయదు. అప్పటికే మంచి నిద్రలోకి జారుకుంటారు. ఎందుకంటే తొందరగా డిన్నర్ చేయడం వలన త్వరగా ఆహారం జీర్ణం అయిపోతుంది. కాబట్టి నిద్ర కూడా బాగా పడుతుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
అలాగని త్వరగా డిన్నర్ చేయమన్నారు కాదా అని ఏది పడితే అది తినేస్తే మొదటికే మోసం వస్తుందని ఇక్కడ తెలుసుకోవాలి. మితంగా తినాలి. అది కూడా రాత్రివేళల్లో ఏవి తింటే అరుగుతుందో అవే తినడానికి యత్నిస్తే బావుంటుంది. త్వరగా తినేసాం కదా అని వెంటనే పడుకోవద్దు. ఇది ఇంకా ప్రమాదం అని అంటున్నారు. ఒక పది నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా డైజెషన్ ప్రాసెస్ సులువు అవుతుంది. ఒక వారం రోజులు ఇలా త్వరగా తినేసి పోస్ట్ మీల్ వాక్ చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలిసిపోతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సరైన సమయంలో ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.