ప్రస్తుతం "H M P V" వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ వైరస్ చైనా లో మొదలయ్యింది. చైనా లో మొదలైన ఈ వైరస్ క్రమ క్రమంగా ఇతర దేశాల్లోకి కూడా పాకుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చైనా తర్వాత ఈ వైరస్ బారిన ఉన్న దేశాల్లో మలేసియా , ఇండియా , జపాన్ , హాంకాంగ్ మొదటి వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ వైరస్ లక్షణాలు కొంత మంది లో కనిపించినట్లు తెలుస్తోంది.

దానితో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ వైరస్ రాకుండా ఉండేందుకు చర్యలు , అలాగే వచ్చిన వారికి ఎలా తగ్గించాలి అనే పనిలో నిమగ్నం అయ్యింది. ఇకపోతే "H M P V" వైరస్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువ రద్దీ గలిగిన ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలి అని , అలాగే ఒక వేళ బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా కూడా కచ్చితంగా మాస్క్ వేసుకొని వెళ్లాలి అని , ఒక వేళ బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన పరిస్థితుల్లో శుభ్రంగా చేతులు కడుక్కొని దుస్తుల్ని మార్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే "H M P V" వైరస్ రాదు అని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ వైరస్ ఎక్కువ శాతం పెద్ద వారి కంటే కూడా చిన్న పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది అని , వారికే ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే చైనా లో మొదలైన ఈ వైరస్ మలేషియా , ఇండియా , జపాన్ , హాంగ్ కాంగ్ లకు ప్రవేశించడంతో ఈ దేశాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఆ దేశ ప్రభుత్వాలు వారికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వైరస్ వారికి సోకకుండా ఉంటుంది అని ప్రభుత్వాలు వారికి సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: