మన భారతీయులు, ముఖ్యంగా  సౌత్ సైడ్ జనాలు పప్పులను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి వివిధ రకాల పప్పులతో ఎన్నో రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అన్నంలోకి కందిపప్పుతో చేసిన కూర లేకపోతే ముద్ద దిగదు. వారంలో కనీసం ఒకటి రెండుసార్లు అయినా పప్పు తినని వారుండరు. పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

అయితే, అన్ని రకాల పప్పులు మన శరీరానికి మేలు చేయవు. ఒక రకమైన పప్పు అయితే మానవ మాంసాన్ని తింటుందని అంటుంటారు! అంతేకాదు, ఇందులో ప్రోటీన్ కూడా ఉండదని చెబుతారు. మరి ఇంతకీ ఆ పప్పు ఏది? ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం రండి. ఆ పప్పు మరేదో కాదు, మనం గారెలు చేసుకునే పెసరపప్పు.

ఈ పప్పును దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. పెసరపప్పుతో అత్తెసరు లేదా హవిష్యణం వంటివి చేసుకొని ఉపవాస దీక్షలు చేసేవారు తింటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని భావిస్తారు కాబట్టి చాలామంది దీనిని ప్రత్యేకంగా తీసుకుంటారు. కానీ, పెసరపప్పు 'మానవ మాంసాన్ని తింటుంది' అనే మాట వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉంది.

వాస్తవానికి, పెసరపప్పులో "ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్" అనే ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి. ఈ ఎంజైమ్‌లు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును, మృతకణాల రూపంలో ఉన్న వ్యర్థాలను శుభ్రం చేస్తాయి.

కాబట్టి, పెసరపప్పు "మానవ మాంసాన్ని తింటుంది" అనేదాని అర్థం అది మన శరీరంలోని కండరాలను తినేయడం కాదు. అది శరీరంలోని విష పదార్థాలను, వ్యర్థాలను, అదనపు కొవ్వును తొలగిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. పెసరపప్పు తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా, పెసరపప్పులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల రక్తపోటును కూడా నియంత్రించవచ్చు. మరి ఇంతటి బలవర్ధకమైన పెసరపప్పును మీ ఆహారంలో భాగం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: