దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసులు పెరుగుతుండడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించడం జరిగింది. సిద్దిపేటకు చెందిన మహిళకు జిబిఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో జిబిఎస్ కారణంగా గత నాలుగు రోజులలో ఒక చిన్నారి సహా మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు.


మరొకవైపు మహారాష్ట్రలోని పూనే లోను దాదాపు 130 జిబిఎస్ అనుమానస్పద కేసులు నమోదు కావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.  జిబిఎస్ లక్షణాలు ఏంటంటే... ఈ వ్యాధి వచ్చిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుంది. కండరాలు బలహీనంగా తయారవుతాయి. తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం వస్తుంది. వాంతులు, వీరేచనాలు అవుతాయి. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.


ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జిబిఎస్ వైరస్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని తొందరగా అటాక్ చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. నరాల వ్యవస్థ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాగా, జిబిఎస్ వైరస్ చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలేత్తడం వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. అందువల్ల చిన్న పిల్లలను అసలు బయటకు తీసుకు రాకూడదని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు.


చిన్నపిల్లల లోనే కాకుండా వృద్ధులలో కూడా ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉందట. వృద్ధులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికి వ్యాధి నుంచి కోలుకునే శక్తి కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి వృద్ధులలో అధికంగా ఉంటుందని వైద్యుల నివేదికలో వెళ్లడైంది. తద్వారా వృద్ధులు అత్యవసర పరిస్థితులలో తప్పితే బయట ఎక్కడా కూడా తిరగకూడదని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెబుతున్నారు. అధిక పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: