![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/newsb31dad7b-79dc-4e2e-bdcd-17e49dd5f468-415x250.jpg)
కొన్ని రోజుల క్రితం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, కందులవారిపల్లి సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారం అందడంతో ఆ గ్రామ ఉప సర్పంచ్ రాకేశ్ చౌదరి కొంతమంది రైతులతో కలిసి వాటిని తరిమేసేందుకు పొలాల దగ్గరకు వెళ్లగా ఘోరం జరిగిపోయింది. ఏనుగులు వారిని వెంబడించడంతో, తప్పించుకోవడానికి పరిగెత్తే క్రమంలో ఏనుగులు ఆయన్ను తొక్కి దారుణాతి దారుణంగా చంపేశాయి. ఈ ఘటన తరువాత అసలు ఏనుగులు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి? ఒకవేళ దాడి చేస్తే చంపేస్తాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవును, ఏనుగులకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎవరన్నా వాటికి హాని తలపెడతారు అనే విషయం అవి పసిగట్టినట్టైతే వెంటనే దాడి చేసి వారిని చచ్చేవరకు తొక్కి తొక్కి ప్రాణాలు తీస్తాయని అంటున్నారు విశ్లేషకులు.
అందుకే హఠాత్తుగా ఏనుగు ఎదురైనపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం తప్పించుకోవచ్చు. ఏనుగు హఠాత్తుగా కనిపిస్తే.. ఏనుగు మనకు 30 మీటర్ల దూరంలోనే పసిగట్టి వేరేవైపు వెళ్ళిపోవాలి. ఇక ఏనుగు చాలా బరువైన జీవి కాబట్టి అవి చెట్లు వంటివి ఎక్కలేవు. అలాంటపుడు అందుబాటులో చెట్లు కనిపిస్తే వాటిని ఎక్కి తప్పించుకోవచ్చు. ఏనుగు ప్రవర్తించే విధానాన్ని బట్టి అది దాడి చేయబోతుందని పసిగట్టవచ్చని ఫారెస్ట్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఏనుగు చెవులు వెనక్కు మడిచి, తర్వాత ఎడం కాలుతో నేలను గీరుతుందంటే అటాక్ చేయడానికి సిద్ధమైందని అర్థం. అప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి నేరుగా కాకుండా, జిగ్‌జాగ్‌గా పరిగెత్తాలి. అదేవిధంగా టపాకాయలు వంటివి పేలించినా కూడా వాటిబారినుండి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.