సగ్గుబియ్యం ని సాధారణంగా పాయసం ఇతరత్రా వాటిలలో వేసుకొని తింటూ ఉంటారు.. అయితే ఈ సగ్గుబియ్యం తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయట. ఈ సగ్గుబియ్యం లో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి గర్భిణీ స్త్రీలు తినడం వల్ల వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందట. ముఖ్యంగా లోపల ఉండే శిశువు అభివృద్ధిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుందట. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడేవారు వీటిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.


సగ్గుబియ్యం లో ఉండేటువంటి ఐరన్ ,క్యాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు చాలా ఉపయోగపడతాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయట. సగ్గుబియ్యం లో ఉండే ప్రోటీన్ వల్ల కండరాలు చాలా బలంగా తయారయ్యేలా చేయడమే కాకుండా శారీరక శక్తిని కూడా పెంచడానికి సహాయపడతాయి. సగ్గుబియ్యం చాలా సన్నగా ఉన్నవారికి ఉపయోగపడతాయట. ఇవి బరువు పెరిగేందుకు కూడా సూచిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గించడానికి పెంచడానికి కూడా ఉపయోగపడుతుందట. ముఖ్యంగా వృద్ధులకు సగ్గుబియ్యంతో చేసిన వాటిని తాపడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా కొంత బలాన్ని కూడా చేకూర్చినట్లు అవుతుందట.


సగ్గుబియ్యం డైటరీ ఫైబర్ని సైతం కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉంచడానికి అలాగే మలబద్ధక సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సగ్గు బియ్యం ఉపవాస సమయాలలో తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలిగి ఉంటా యట.. ఇది తక్షణ శక్తిని అందించడమే కాకుండా శక్తివంతమైన ఆహారంగా ఉపయోగపడుతుందట.. ఈ సగ్గు బియ్యాన్ని కిచిడీలు ఉపయోగించి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది దీనివల్ల ఆరోగ్యంగా కూడా కాపాడేలా చేస్తుందట. సగ్గుబియ్యం ఉడికి ఉబ్బడం వల్ల మరిన్ని పోషకాలు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: