![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/if-you-drink-alcohol-does-the-liver-become-like-thisa35a69d9-c35c-428f-9ced-9ad54404bf34-415x250.jpg)
ఈ క్రమంలోనే యువతలో లివర్ ఇన్‌ఫ్లమేషన్, ఫ్యాటీలివర్, స్కార్‌డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ గణనీయంగా పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదే విషయమై ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాలేయం మద్యం సేవించడం వలన ఎలా మారిపోతుందో తెలియజేయడానికి ఓ వీడియోని విడుదల చేయడం జరిగింది. లివర్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్ సదరు వీడియోలో... "నార్మల్ లివర్ అయితే పెద్దదిగా, సాఫ్ట్ గా ఉంటుంది. మద్యానికి అలవాటు పడిన వారి లివర్లో కొవ్వు నిల్వలు పెరిగి వాపు వచ్చి, బూడిద కలర్లోకి మారుతాయి!" అని చెప్పుకొచ్చాడు. అవును... మద్యం తగిన వారి లివర్లో కొవ్వు నిల్వలు పెరిగి, లివర్ సేల్స్ డామేజ్ అయ్యి కాలేయం దెబ్బతింటుంది. ఈ క్రమంలో క్యాన్సర్ వచ్చి లివర్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది.
అందుకే ఆల్కహాల్ ని స్లో పాయిజన్ తో పోలుస్తారు. ఆల్కహాల్‌తో ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకుంటేనే, వ్యాయామం వంటి మార్గాలను వెతకాలి డాక్టర్లు సూచిస్తున్నారు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది కాబట్టి ఏదైనా సమస్య ఉన్నట్టయితే వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తే ఉత్తమం!