నేడు ప్రపంచమే స్మార్ట్ ఫోన్ మయం అయిపోయింది. మరికొన్ని సంవత్సరాలు ఆగితే... ఈ భూమ్మీద మనుషులు ఎందరు ఉన్నారో స్మార్ట్ ఫోన్స్ కూడా అన్నే ఉంటాయి అని చెప్పాల్సి వస్తుందేమో అన్న మాదిరి ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తోంది. అవును, ఈ ఆధునిక ప్రపంచం స్మార్ట్ ఫోన్ కి మెల్ల మెల్లగా అడిక్ట్ అవుతోంది. అయితే అది ఇపుడు నిత్యావసర వస్తువుగా తయారైపోయింది మరి! ఆన్‌లైన్‌ చెల్లింపుల దగ్గరి నుంచి, షాపింగ్‌, టికెట్‌ బుకింగ్స్, సోషల్‌ మీడియా వంటివి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాంతో చాలామంది ఫోన్‌కు పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నారు. ఎంతలా అంటే? ఒక్క క్షణం కూడా ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారు మరి!

అవును, మనలో చాలామంది అర్ధరాత్రి దాకా ఫోన్ చూస్తూ, మరుసటిరోజు ఉదయాన్నే నిద్రలేచీ లేవడంతోనే మంచం దిగకుండానే కళ్లు నలుపుకుంటూ మరలా స్మార్ట్ ఫోన్లో బిజీ అయిపోతుంటారు. ఇలా అతిగా ఫోన్ ఉపయోగించడం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఉదయాన్నే నిద్రలేచి మొబైల్‌ ఫోన్‌ చూడటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మెజారిటీ పీపుల్‌ ఉదయాన్నే నిద్రలేచి ఫస్ట్‌ సోషల్ మీడియా ఓపెన్ చేస్తారని సర్వేలు చెబుతున్నాయి. రాత్రి నుంచి whatsapp, facebook, instagramకు సంబంధించి నోటిఫికేషన్లు ఏవైనా వచ్చాయా అనేది చెక్ చేసి చూసుకుంటారు. మరికొంత మంది ఈ-మెయిల్స్ వచ్చాయేమో అని చెక్‌ చేసుకుని రోజుని ప్రారంభిస్తుంటారు.

కానీ.. ఇలా చెక్‌ చేసుకోవడం వల్ల మానసికంగా అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. విషయం ఏమిటంటే? అలా చూసిన నోటిఫికేషన్లలో మీకు నచ్చని అంశాలు, కోపగించుకునే విషయాలు ఏవైనా ఉంటే.. మీ ఉదయం చిరాకుతోనే మొదలవుతుందని, ఆ ఫీలింగ్ ఆ రోజంతా అలాగే ఉంటుందని చెబుతున్నారు.  కొనసాగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే ఎర్లీ మార్నింగ్ ఫోన్‌ చూడటం వల్ల మనం అనుకున్న పనులను, లక్ష్యాలను చేరడంలో కొంత విఫలం కావొచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల మన మైండ్‌ డైవర్ట్‌ అవుతుందని సర్వేలో తేలింది. అంతేకాకుండా ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ కి ఎంత దూరంగా గడిపితే అన్ని సత్ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: