తెలంగాణలో గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేపుతోంది. తాజాగా సిద్దిపేట సమీపంలోని సీతారాం పల్లికి చెందిన ఓ వివాహిత గత నెలలో జనవరి 31న ఈ వ్యాధి బారిన పడింది. గత నెల రోజులపాటు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మహిళ ఈరోజు మృతి చెందింది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో మహిళ మృతి చెందడం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తోంది.  ఇక ఈ మరణం నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌ అయింది.



ఈ వ్యాధి లక్షణాలు ఏంటో చూద్దాం....?

గిలియన్ బారే సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థ పరిదీయ నాడి వ్యవస్థ పైన తీవ్రంగా దాడి చేస్తోంది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన తిమ్మిరి వస్తోంది. బలహీనంగా తయారవుతారు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. పక్షపాతం వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వారికి అధికంగా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకిన రోగులు నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటివారు వాకర్ సహాయాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ వ్యాధిలో నరాల వాపు తీవ్రంగా వస్తోంది. గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.


అందుకోసం బలమైన పౌష్టికి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఎన్నో పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలని బయటి ఆహారాన్ని, వ్యర్థ పదార్థాలను అస్సలు తీసుకోకూడదని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు అసలు బయటికి రాకూడదని చెబుతున్నారు. ఏమైనా అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకినట్లయితే వృద్ధులు కోల్పోవడం చాలా కష్టమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: