మొబైల్‌ వినియోగం నేడు తప్పనిసరి అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు సెల్‌ఫోన్‌లోనే మునిగితేలిపోతున్నారు. చాటింగ్‌లు, మేసేజ్‌లు, కాలింగ్స్‌ ఇలా రకరకాలుగా ఉపయోగిస్తూ నిత్యం మొబైల్ ప్రపంచంలోనే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే? సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి మొబైల్స్‌ నుంచి వెలువడే రేడియేషన్‌ మనుషులపై చాలా దారుణమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని.. ప్యాంట్‌ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయనీ, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ.. రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేష‌న్ అని చెప్పుకోవచ్చు. కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. అయితే.. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ఆ స్థాయిలో లేదని.. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే ఫోన్‌ రేడియేషన్‌ ఉంటున్నదని అనేక సెల్ ఫోన్ సంస్థలు వాదించినప్పటికీ ఈ విషయంలో డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులను సెల్‌టవర్లు అయోమయానికి గురి చేస్తాయని.. వీటి నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ వాటి గుడ్లను నాశనం చేస్తాయని నిపుణుల అభిప్రాయం.

అయితే మనలో చాలామంది మొబైల్ రేడియేషన్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలి? అనే ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. అది చాలా సింపుల్. మీరు మీ మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను చెక్‌ చేయాలనుకుంటే.. మొబైల్‌లో *#07# డయల్ చేయాలి. మీరు ఈ నంబర్‌కు డయల్ చేసిన వెంటనే.. మొబైల్ స్క్రీన్‌పై రేడియేషన్ సంబంధిత సమాచారం కనిపిస్తుంది. ఇందులో రేడియేషన్ స్థాయిని రెండు రకాలుగా చూపుతారు. ఒకటి ‘తల’ రెండోది ‘శరీరం’. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు తలకు మొబైల్ రేడియేషన్ స్థాయి.. శరీరానికి రేడియేషన్ స్థాయి అంటే ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు లేదా జేబులో పెట్టుకున్నప్పుడు ఏ స్థాయిలో రేడియేషన్ ఉంటుందనేది అని అర్ధం. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క స్పెసిఫిక్ అబ్సార్ప్షన్ రేట్ (SAR) ప్రకారం.. ఏదైనా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర స్మార్ట్ పరికరం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6 వాట్‌లకు మించకూడదు. ఈ నియమం శరీరం నుంచి పరికరం యొక్క 10 మిల్లీమీటర్ల దూరానికి కూడా వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: