మన దేశంలో ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు అంటే అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పేషంట్లకు వైద్యాన్ని అందిస్తూ ఉంటారు. ఇలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధునాతన టెక్నాలజీ ఉండడంతో డబ్బున్న వారు ఎక్కువ శాతం ఇలాంటి ఆస్పత్రుల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇక డబ్బు లేని పేదవాళ్లు కూడా తమకు వచ్చిన రోగాన్ని నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్మి కూడా ఇలాంటి ఆస్పత్రుల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇక పేద వాళ్లకు అంతో , ఇంతో ఊరటను కల్పించేందుకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొంత మంది పేదలకు ఉచితంగా వైద్యం చేయాలి అనే నిబంధన కూడా ఉంది.

కానీ ఈ నిబంధన పెద్దగా మన దేశంలో అమలు కావడం లేదు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఇలాంటి సంఘటన విషయం లోనే సుప్రీం కోర్టు ఓ కార్పొరేట్ ఆసుపత్రి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఢిల్లీ లోని ఇంద్రప్రస్థా లో అపోలో ఆసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రి వారికి ప్రభుత్వం 15 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చింది. ఈ లిజ్ లో భాగంగా ఢిల్లీలో ని చందప్రస్తా లో ఉన్న అపోలో ఆసుపత్రి పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన నిబంధన ఉంది.

తమ ఆసుపత్రికి వచ్చిన పేషంట్లలో 40% మంది ఓపి పేషెంట్లకు ఉచితం వైద్యం అందించాలి అనే నిబంధనకు అంగీకరించిన తర్వాతే ప్రభుత్వం ఆ 15 ఏకరాల భూమిని ఈ ఆసుపత్రి కి లిజ్ కి ఇచ్చింది. కానీ ప్రస్తుతం వారు అలా 40 శాతం మంది ఓపి పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించడం లేదు అని , కచ్చితంగా మీరు ఉచిత వైద్యం పేదలకు అందించాలి అని , లేని పక్షంలో మీ హాస్పిటల్ ను ఎయిమ్స్ హాస్పటల్ కి లింక్ చేస్తాము అని సుప్రీం కోర్టు ఈ ఆస్పత్రికి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: