మనలో చాలామంది పెరుగన్నం తినడానికి ఇష్టపడతారు మరి కొంతమంది వీటిని తినడానికి మక్కువ చూపరు.. కానీ దక్షిణాది భారతీయులలో పెరుగన్నానికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉన్నది.. భోజనం చివరిలో కచ్చితంగా పెరుగన్నం తినడం ఎన్నో ఏళ్ల ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందుకే చాలామంది ఇక్కడ పెరుగన్నం లేకుండా భోజనం చేయరు.. అయితే ఒకవేళ  పెరుగన్నం తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయి.. తినకపోతే ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.



పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా చేస్తాయి.. అందుకే మసాలా పదార్థాలు ఎక్కువగా ఉన్న భోజనం తిన్నవారు కచ్చితంగా పెరుగన్నం తింటే వారికి కడుపులో చల్లగా ఉంటుంది.. మన పూర్వీకులు సైతం పెరుగన్నం తినడం వల్ల వాత, పిత్త ,కఫా వంటి వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా తింటూ ఉంటారట.. ఇటీవలే కొంతమంది సైంటిస్టులు పరిశోధనలు చేసిన ప్రకారం పెరుగన్నం తినేవారిలో జీర్ణ సమస్యలు 30 శాతం వరకు చాలా తక్కువగా ఉంటాయని తెలియజేశారు. పెరుగన్నం తినడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా ఉండవని తెలియజేస్తున్నారు.


పెరుగన్నం తినకపోతే కచ్చితంగా కడుపులో మంట, గ్యాస్ సమస్యలు రోగనిరోధక శక్తి తగ్గిపోతుందట. నిజానికి ప్రతిరోజు 100హ150 గ్రాముల పెరుగును మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

పెరుగన్నం తినడం వల్ల ప్రయోజనాలు విషయానికి వస్తే..
1). శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడానికి
2). గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి అలాగే బరువు తగ్గించడానికి.
3). జీర్ణ క్రియను మెరుగుపరచడానికి.
4). పెరుగన్నం తింటే రక్తపోటు సమస్యలు 20 శాతం వరకు తగ్గుతాయట.


అయితే ఎక్కువగా నిల్వ ఉంచిన పెరుగును కాని పెరుగు అన్నాన్ని కానీ తింటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. మాంసాహారం తో కలిపి పెరుగుని తినడం వల్ల జీర్ణక్రియ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుందట. పెరుగన్నన్ని సరైన మోతాదులలో తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: