సాధారణంగా ఈ మధ్యకాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేకుండా దుస్తులు ధరిస్తూ ఉన్నారు.. అమ్మాయిలు కూడా బిగువైన దుస్తులు ధరిస్తూ జీన్స్ వంటివి వేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని కొంతమంది వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. బిగువైన జీన్స్ దుస్తులు ధరించడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయట. మరి అలా వేసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


జీన్స్ ప్యాంట్ బిగుతుగా వేసుకోవడం వల్ల .. చర్మం పైన చాలా ఒత్తిడి పెరిగి చమటను బయటికి రానివ్వకుండా చేస్తోందట. దీనివల్ల చర్మం పైన దద్దుర్లు, అలర్జీ వంటి సమస్యలు ఏర్పడి చర్మ సమస్యలకు దారితీస్తుందట.

టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకుండా చేస్తుందట. దీనివల్ల తొడలు, కాళ్ల నొప్పి, వాపులు వంటివి ఎక్కువగా వస్తాయట. ఇలా చాలాకాలం పాటు ఉన్నట్లు అయితే నరాల సమస్యలు ఎదురవుతాయట.


బిగువైన దుస్తులు ధరిస్తే జీర్ణ వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యలు అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువసేపు టైట్ జీన్స్ ని ధరించడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి నరాల సమస్యలు కూడా ఏర్పడతాయట.


బిగువైన జీన్స్ దుస్తులు ధరించడం వల్ల కొన్ని సందర్భాలలో కాళ్లు చేతులు శరీరం అన్నీ కూడా తిమ్మిరి పట్టేలా చేస్తుందట.

తీసుకోవలసిన జాగ్రత్తలు:
బిగువైన దుస్తుల కంటే వదులుగా ఉండే దుస్తులు ధరించడమే ఉత్తమం.

టైట్ జీన్స్ కంటే కాటన్ జీన్స్ ధరించడం ఉత్తమం. ఇది శరీరాన్ని చాలా మృదువుగా తయారు చేస్తుందట.

మనం దుస్తులు ధరించేటప్పుడు.. మన సౌకర్యంగా కూర్చోనేలా ఉండాలట లేకపోతే వెన్నునొప్పి సమస్యలు ఎదురవుతాయి.


ఎలాంటి దుస్తులు వేసుకున్నప్పటికీ కూడా మనం ప్రతిరోజు తగినన్ని నీటిని తాగడం మాత్రం మర్చిపోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: